Varanasi Movie: దర్శక ధీరుడు రాజమౌళి మహేష్ బాబుని హీరోగా పెట్టి చేస్తున్న ‘వారణాసి’ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. రాజమౌళి పాన్ వరల్డ్ లో చేస్తున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం…ఇక ఇదిలా ఉంటే ఈ రోజు మహేష్ బాబు బర్త్ డే కావడంతో సినిమా నుంచి మహేష్ బాబు లుక్స్ ని రిలీజ్ చేస్తూ ఒక రెండు పోస్టర్స్ రిలీజ్ చేశారు. అందులో మహేష్ బాబు వెదురు బొంగుల మీద పడుకొని ఉన్న ఒక పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. అయిన వెనక్కి తిరిగి ఉన్న మరొక పోస్టర్ సైతం ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంటుంది. ఇది కొంచెం మాస్ లుక్ లో ఉండటం తో అది చూసిన ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు అభిమానులు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. నిజానికి ఈరోజు టీజర్ కనక రిలీజ్ చేసి ఉంటే మహేష్ బాబు అభిమానుల అందానికి అవధులు ఉండేవి కాదు. కానీ జక్కన్న మాత్రం టీజర్ ని రిలీజ్ చేయకుండా కేవలం పోస్టర్లు రిలీజ్ చేసి కొంతవరకు మహేష్ బాబు ఫ్యాన్స్ ను సంతోషపడేలా చేస్తున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి నటుడు మొదటిసారి పాన్ వరల్డ్ లో సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా మీద వాళ్ళ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం మంచి అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే మహేష్ బాబు చాలా కష్టపడుతూ ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడట. చాలా సన్నివేశాల్లో డూప్స్ లేకుండా ఒరిజినల్ గా చేస్తు ఆ నాచురాలిటీ తీసుకురావడం లో ఆయన చాలావరకు కష్టపడుతున్నాడు అంటు సినిమా యూనిట్ నుంచి కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఈరోజు ప్రముఖ హాలీవుడ్ ప్రమోషన్ పేజీ నుంచి మహేష్ బాబు సంబంధించిన ఫోటోలు రిలీజ్ అవ్వడం అనేది నిజంగా ప్రతి ఒక్కరిని సంతోష పెట్టే విషయమనే చెప్పాలి. ఇది ఏమైనా కూడా ఈ సినిమా ఏప్రిల్ 7, 2027 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కాబట్టి ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా శర వేగంగా పూర్తి చేస్తున్నారు. మరొక 20% షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్న నేపథ్యంలో వచ్చే నెలలో షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసి అక్టోబర్ నెల నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద బిజీగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిన పుటెజ్ మీద పోస్ట్ ప్రొడక్షన్ వర్క్
జరుగుతుందట. ఇక తొందర్లోనే టీజర్ ను సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడు…