Bigg Boss 7 Telugu: ఎపిసోడ్ హైలెట్స్… ఎలిమినేషన్ లో 8 మంది, తేజాకు భర్త హోదా ఇచ్చిన శోభ, స్నానం చేయిస్తా అంటూ సరసాలు!

నువ్వు నాకు ఐడియా కూడా లేవు. నన్ను నామినేట్ చేసావు అందుకే చేస్తున్నా అని అశ్విని అంది. అయితే రివేంజా అని యావర్ అన్నాడు. అవును రివేంజే అంటూ సమాధానం చెప్పింది. నువ్వు నన్ను గెలికావు, అందుకే నేను నిన్ను గెలికాను అని అశ్విని అన్నది.

  • Written By: NARESH
  • Published On:
Bigg Boss 7 Telugu: ఎపిసోడ్ హైలెట్స్… ఎలిమినేషన్ లో 8 మంది, తేజాకు భర్త హోదా ఇచ్చిన శోభ, స్నానం చేయిస్తా అంటూ సరసాలు!

Bigg Boss 7 Telugu: మంగళవారం కూడా నామినేషన్స్ ప్రక్రియ కొనసాగింది. సోమవారం రతిక, భోలే, ప్రియాంక, ప్రశాంత్, తేజ, అర్జున్ తాము ఇంటి నుండి పంపేయాలనుకున్న ఇద్దరు హౌస్ మేట్స్ ని నామినేట్ చేశారు. మంగళవారం శోభ… రతిక, యావర్ లను నామినేట్ చేసింది. ఈ క్రమంలో రతిక-శోభ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం యావర్… అశ్వినిని నామినేట్ చేశాడు. వీరిద్దరి మధ్య సుదీర్ఘ వాదన జరిగింది.

నువ్వు నాకు ఐడియా కూడా లేవు. నన్ను నామినేట్ చేసావు అందుకే చేస్తున్నా అని అశ్విని అంది. అయితే రివేంజా అని యావర్ అన్నాడు. అవును రివేంజే అంటూ సమాధానం చెప్పింది. నువ్వు నన్ను గెలికావు, అందుకే నేను నిన్ను గెలికాను అని అశ్విని అన్నది. అవునా గెలికించుకోవడం నాకు కూడా ఇష్టం వచ్చి గెలుకు అంటూ యావర్ విచిత్రమైన పోజు పెట్టాడు. వీరి డిస్కషన్ చూసి తోటి హౌస్ మేట్స్ నవ్వుకున్నారు.

కెప్టెన్ గౌతమ్… అమర్ దీప్ ని నామినేట్ చేశాడు. మొత్తంగా నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. అమర్ దీప్, యావర్, ప్రియాంక, రతిక, శోభా, తేజ, అర్జున్, భోలే నామినేట్ అయినట్లు బిగ్ బాస్ వెల్లడించారు. ఈ 8 మందిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఎలిమినేషన్స్ లోకి వచ్చినందుకు తేజ బాధపడ్డాడు. శివాజీ భయపడకురా నువ్వు బయటకు వెళ్లవు అని ధైర్యం చెప్పాడు. సందీప్ వెళ్ళిపోలా అని తేజా తన భయాన్ని భయటపెట్టాడు. సందీప్ డాన్సర్ కాదు కొరియోగ్రాఫర్ అని మాట్లాడటం జనాల్లో నెగిటివిటీకి కారణమై ఉండొచ్చని శివాజీ అన్నాడు.

అనంతరం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. ఇంట్లో ఉన్న నలుగురు అమ్మాయిలను మహారాణులుగా చూసుకోవాలని అబ్బాయిలను ఆదేశించారు. దాంతో లేడీ కంటెస్టెంట్స్ అబ్బాయిలతో సేవలు చేయించుకున్నారు. తేజా అయితే ఏకంగా శోభా పళ్ళు తోమాడు. నువ్వు నా హస్బెండ్ అని తేజాతో శోభా అన్నది. అయితే ఓకే, పళ్ళు తోమాక, స్నానం కూడా చేయిస్తా అంటూ సరసాలు ఆడారు. ఇలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది…

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు