Unicorns IIT : దేశ స్టార్టప్ లలో ఐఐటీయన్ల సత్తా

Unicorns IIT : భారతదేశంలోని 100 యునికార్న్‌లలో 73 మంది ఐఐటీల నుంచి కనీసం ఒక ఫౌండర్ ను కలిగి ఉన్నారని అనలిటిక్స్ సంస్థ ట్రాక్‌ఎక్స్‌ఎన్ టెక్నాలజీస్ షేర్ చేసిన డేటా వెల్లడించింది. వీటిలో 23 ఫౌండర్లలో ఏడుగురు ఐఐటీకి చెందినవారున్నారు. ఐఐటీ ఢిల్లీ నుంచి అత్యధిక మంది ఐఐటీయన్లు ఉన్నారు. దాదాపు 21 యునికార్న్‌లకు కనీసం ఒక వ్యవస్థాపకుడు ఐఐటి ఢిల్లీ పూర్వ విద్యార్ధులు ఉండడం విశేషం. ఆ తర్వాత ఐఐటి బాంబే నుంచి 16 […]

  • Written By: Naresh
  • Published On:
Unicorns IIT : దేశ స్టార్టప్ లలో ఐఐటీయన్ల సత్తా

Unicorns IIT : భారతదేశంలోని 100 యునికార్న్‌లలో 73 మంది ఐఐటీల నుంచి కనీసం ఒక ఫౌండర్ ను కలిగి ఉన్నారని అనలిటిక్స్ సంస్థ ట్రాక్‌ఎక్స్‌ఎన్ టెక్నాలజీస్ షేర్ చేసిన డేటా వెల్లడించింది. వీటిలో 23 ఫౌండర్లలో ఏడుగురు ఐఐటీకి చెందినవారున్నారు. ఐఐటీ ఢిల్లీ నుంచి అత్యధిక మంది ఐఐటీయన్లు ఉన్నారు. దాదాపు 21 యునికార్న్‌లకు కనీసం ఒక వ్యవస్థాపకుడు ఐఐటి ఢిల్లీ పూర్వ విద్యార్ధులు ఉండడం విశేషం. ఆ తర్వాత ఐఐటి బాంబే నుంచి 16 మంది ఉన్నారు. ఐఐటీ కాన్పూర్ 12 మంది , ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ రూర్కీ మరియు ఐఐటీ గౌహతిల నుంచి అత్యధిక మంది ఉన్నారు. మిగిలిన నాలుగు ఐఐటీ లు వెనుకబడి ఉన్నాయి.

Unicorns IIT

Unicorns IIT

ఐఐటి నుండి వచ్చే ఒక వ్యవస్థాపకుడు ఖచ్చితంగా వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. వారి సక్సెస్ రేటు దేశంలో బాగా ఉంది. ఇది కేవలం ఐఐటీల గురించి మాత్రమే కాదు, బిట్స్ వంటి కొన్ని ఇతర ఉన్నత కళాశాలలకు కూడా సంబంధించినది” అని ఓ పెట్టుబడిదారు వ్యాఖ్యానించారు. ఇక ఈ రంగంలో నాన్-ఐఐటీయన్లు అక్కడ ఉన్నారు.

Also Read: BJP To Refuse If Jagan Asks: జగన్ అడిగితే కాదనడం బీజేపీకి సాధ్యమా?

ప్రతి సంవత్సరం భారతదేశంలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఐఐటీ ప్రవేశ పరీక్షకు హాజరవుతారు, అయితే దేశంలోని 23 ఐఐటీల్లో 10,000 మంది విద్యార్థులు మాత్రమే ఎంపికవుతున్నారు.

ఐఐటీయేతర వ్యవస్థాపకుల వాటా పెరుగుతూనే ఉంది. బిట్స్ పిలానీ ప్రాముఖ్యతను పొందింది. డెకాకార్న్స్‌గా మారిన మూడు భారతీయ స్టార్టప్‌ల వ్యవస్థాపకులు- పేటీం విజయ్ శేఖర్ శర్మ, బైజూస్‌కు చెందిన బైజు రవీంద్రన్.. స్విగ్గీకి చెందిన శ్రీహర్ష మెజెటీ — ఐఐటీలకు చెందినవారు కాకున్న దేశంలో సక్సెస్ సాధించిన పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు.

Also Read: Minister Ambati Rambabu: వైఎస్సార్ ఆసరా అంటే ఏంటమ్మా.. నవ్వులపాలైన మంత్రి అంబటి

సంబంధిత వార్తలు