China Company: అదృష్టమంటే వారిదే. మనకేదైనా లక్కు కలిసొస్తే నక్కను తొక్కాడురా అంటారు. కానీ వారు ఏ నక్కను తొక్కలేదు. వారికి అదృష్టం పడిశం పట్టినట్లు పట్టింది. ఏకంగా కోటీశ్వరులైపోయారు. సంస్థకు వచ్చిన లాభాల్లో వారికి కూడా వాటా అందించడమంటే మాటలు కాదు. అదే మన దేశంలో అయితే యజమాని ఒక్కడే లాభం పొందుతాడు. కానీ చైనాలో అలా కాదు. కంపెనీ సాధించిన లాభాలను సంస్థ ఉద్యోగులకు పంచి వారిలో మానవత్వాన్ని చాటుకున్నారు. లాభాలంటే లక్షలు కాదు ఏకంగా కో్ట్లే కావడం గమనార్హం.

China Company
కరోనా కాలంలో అన్ని కంపెనీలు దివాలా తీశాయి. కొన్ని కంపెనీలైతే ఉద్యోగులను తొలగించాయి. చైనాలో ఉన్న హెనాన్ మైన్ అనే కంపెనీ క్రేన్లను ఉత్పత్తి చేస్తుంది. కరోనా కాలంలో వీరికి లాభాలు ఘనంగా వచ్చాయి. దీంతో లాభాలకు కారణమైన ఉద్యగులకు వాటా ఇవ్వాలని భావించింది. అందులో మెరుగైన పనితీరు కనబరచిన ఓ ముప్పై మంది ఉద్యోగులను ఎంపిక చేసింది. వారికి లాభాలు చెక్కు రూపంలో కాకుండా నగదు రూపంలో అందించాలని భావించింది. ఇందులో భాగంగా నోట్ల కట్టలను కుప్పలుగా పోసింది.
ముప్పై మంది ఉద్యోగులకు 61 మిలియన్ యునాన్లు అంటే రూ.73 కోట్లు బోనస్ గా ఇవ్వాలనుకుంది. దీంతో నగదు వారికి పంపిణీ చేసేందుకు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో రూ.73 కోట్లు పంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యోగులు సంచులు పట్టుకుని రావాల్సి వచ్చింది. ఉద్యోగులలో అత్యుత్తమ ప్రతిభ చూపిన ముగ్గురికి రూ. 5 మిలియన్ యునాన్లు (రూ.6 కోట్లు), మిగతా వారికి ఒక మిలియన్ యునాన్లు అంటే రూ. 1.20 కోట్లు పంపిణీ ేసింది. దీంతో వారు డబ్బుల బ్యాగులతో వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి.

China Company
ఇలా డబ్బుల కట్టలు పంచిన కంపెనీని పలువురు అబినందించారు. ఒక్కో ఉద్యోగికి రూ. కోట్లలో నగదు ఇవ్వడంతో వారి కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో లక్ష్మీదేవి వారి ఇంట కళకళలాడింది. నోట్ల కట్టలు చూసి నివ్వెరపోయారు. సంస్థ తమకు అందించిన భారీ నజరానాకు ఉబ్బితబ్బిబ్బయ్యారు. అదృష్టమంటే అలా ఉండాలి. డబ్బుల కట్టలు నడిచి ఇంటికి వచ్చిన తీరు అద్భుతం. మొత్తానికి డబ్బులు నట్టింట నడయాడటంతో అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది.