ఏడుగురు కాంగ్రెస్‌ ఎంపీల సస్పెన్షన్

ఏడుగురు కాంగ్రెస్‌ ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. సభ సజావుగా జరగకుండా ఆటంకం కలిగిస్తున్న ఈ ఏడుగురిపై స్పీకర్‌ ఓంబిర్లా చర్యలు తీసుకున్నారు. సభలో అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ఈ ఏడుగురు ఎంపీలను ప్రస్తుత సెషన్ నుంచి స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. సస్పెండ్‌ అయిన ఎంపీల్లో గౌరవ్‌ గోగోయ్‌, టీఎన్‌ ప్రతాపన్‌, డీన్‌ కురియాక్స్‌, మాణిక్‌ ఠాకూర్‌, బెన్నీ బెహ్నన్‌, గర్జిత్‌ అహ్లువాలియా, ఆర్‌. ఉన్నితన్‌ ఉన్నారు. సభాధ్యక్షుడి చేతులో నుండి పత్రాలను లాగివేసుకోవడం స్పీకర్ పట్ల […]

  • Written By: Neelambaram
  • Published On:
ఏడుగురు కాంగ్రెస్‌ ఎంపీల సస్పెన్షన్

ఏడుగురు కాంగ్రెస్‌ ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. సభ సజావుగా జరగకుండా ఆటంకం కలిగిస్తున్న ఈ ఏడుగురిపై స్పీకర్‌ ఓంబిర్లా చర్యలు తీసుకున్నారు. సభలో అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ఈ ఏడుగురు ఎంపీలను ప్రస్తుత సెషన్ నుంచి స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు.

సస్పెండ్‌ అయిన ఎంపీల్లో గౌరవ్‌ గోగోయ్‌, టీఎన్‌ ప్రతాపన్‌, డీన్‌ కురియాక్స్‌, మాణిక్‌ ఠాకూర్‌, బెన్నీ బెహ్నన్‌, గర్జిత్‌ అహ్లువాలియా, ఆర్‌. ఉన్నితన్‌ ఉన్నారు.

సభాధ్యక్షుడి చేతులో నుండి పత్రాలను లాగివేసుకోవడం స్పీకర్ పట్ల అమర్యాద వ్యక్తం చేయడమే అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు. కాంగ్రెస్ సభ్యులు నిరంతరం సభాకార్యక్రమాలకు కలిగిస్తున్న అడ్డంకులను పరిశీలించడం కోసం ఒక కమిటీని నియమించామని స్పీకర్ ను కోరినట్లు ఆయన చెప్పారు.

వరుసగా మూడో రోజు కూడా సభలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా వాయిదా పడింది. ఢిల్లీ అల్లర్లపై వెంటనే చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యులు గందరగోళ దృశ్యాలు సృష్టిస్తున్నారు. ఈ నెల 11న ఈ విషయమై చర్చించడానికి ప్రభుత్వం అంగీకరించినా వారి సాటించలేదు.

సంబంధిత వార్తలు