Natural Places In India: దేశంలో అద్భుతమైన ప్రదేశాలు, తప్పనిసరిగా చూడాల్సిన భౌగోళిక వింతలు
లోనార్ బిలం అని పిలవబడే లోనార్ లేక్ మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని లోనార్ వద్ద ఉంది. సుమారు 1.2 కిలోమీటర్ల పోడవు, దాదాపు 137 మీటర్లు లోతుతో ఉంటుంది.

Natural Places In India: ప్రాచీన సాంప్రదాయాలు పురాతన కట్టడాలకు ప్రసిద్ధ నిలయం భారతదేశం. ఇక్కడ పురాత కాలంలో రాజులు నిర్మించిన కట్టడాలు ఇప్పటికీ అద్భుతంగా అలరిస్తూ ఉంటారు. మానవ నిర్మితమైనవే కాకుండా ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన ప్రదేశాలు ఎంతో ఆకట్టుకుంటాయి. మూడు వైపులా మూడు సముద్రాలు.. ఉత్తరాన హిమాలయాలు, అతిపోడవైన నదులు దేశంలో నిక్షిప్తమై ఉన్నాయి. సుమారు 9 కోట్ల సంవత్సరాల కిందట గోండ్వానా లాండ్ నుండి విడిపోయి భారత్ ఏర్పడిందని చరిత్ర తెలుపుతోంది. కాలక్రమేణా వాతావరణ పరిస్థితుల భౌగోళికంగా అనేక అద్భుత కట్టడాలు ఏర్పడ్డాయి. వాటిలో 6 గురించి తెలుసుకుందాం.
గండికోట లేదా పెద్ద లోయ:
ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ ఆర్ జిల్లాలోని జమ్మలమడుగు మండలంలో గండికోట గ్రామం ఉంది. ఈ గ్రామంలో ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన పర్వత శ్రేణి ఆకట్టుకుంటుంది. జమ్మలమడుగుకు పడమర దిశగా 14 కిలో మీటర్ల దూరంలో ఎర్రమల పర్వత శ్రేణి దాదాపు 300 అడుగుల ఎత్తులో ఉంటుంది. పెన్నానది తీరాన ఉన్న ఈ కొండలు ఎర్ర రాతితో నిర్మించినట్లు కనిపిస్తూ ఆకట్టుకుంటాయి.
లివింగ్ రూట్ బ్రిడ్జి:
ఇంజనీర్లు కూడా నిర్మించలేని అద్భతమైన బ్రిడ్జిలు ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయి. ఈశాన్య భారత్ లోని మేఘాలయ రాష్ట్రంలో 180 సంవత్సరాల కింద తూర్పు ఖాసీ హిల్స్, పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాల మధ్య ఇవి కనిపిస్తాయి. ఇప్పుడు ఈ రెండు జిల్లాల వాసులు రాకపోకలకు వీటినే ఉపయోగిస్తున్నారు. ఒకేసారి 50 మంది నిలబడినా ఇవి తట్టుకోగల సామర్థ్యం ఈ వంతెనలకు ఉండడం విశేషం.

Living root bridge
లోనార్ సరస్సు:
లోనార్ బిలం అని పిలవబడే లోనార్ లేక్ మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని లోనార్ వద్ద ఉంది. సుమారు 1.2 కిలోమీటర్ల పోడవు, దాదాపు 137 మీటర్లు లోతుతో ఉంటుంది. ఇది దాదాపు 65 మిలియన్ సంత్సరాల క్రితం అగ్నిపర్వతం బద్దలవడం ద్వారా ఏర్పడినట్లు చెప్పుకుంటున్నారు. 2019లో ఐఐటీ బాంబే నిర్వహించిన అధ్యయనంలో ఇందులో అనేక ఖనిజాలాు ఉన్నట్లు తేలింది.

Lonar Lake
మార్బుల్ రాక్స్:
మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ జిల్లా..భేదాఘాట్ లో మార్బుల్ రాక్స్ కనిపిస్తాయి. నర్మదా నది గుండా పాలరాయితో గోడ కట్టినట్లు కనిపిస్తుంది. సుమారు 8 కిలోమీటర్ల పోడవున అందమైన ఈ లోయ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మధ్యప్రదేశ్ లో నర్మదా నది 1,077 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. కానీ భేదాఘాట్ వద్ద ఈ నది అందంగా కనిపిస్తుంది.

Marble Rocks
థార్ ఎడారి:
రాజస్థాన్ లోని థార్ ఎడారిని గ్రేట్ ఇండియన్ డెసర్ట్ గా పిలుస్తారు. థార్ ఎడారి 92,200 చదరపు మైళ్లు విస్తరించి ఉంది. భారతదేశంలో ఈ ఎడారి రాజస్థాన్ లో 61 శాతం, గుజరాత్ లో 20 శాతం, పంజాబ్, హర్యానాలో 9 శాతం విస్తరించి ఉంది. సుమారు 4 వేల సంవత్సరాల క్రితమే ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినట్లు చరిత్ర తెలుపుతోంది.
రాన్ ఆఫ్ కచ్:
భారతదేశం, పాకిస్తాన్ మధ్యలో గుజరాత్ రాష్ట్రంలో రాన్ ఆప్ కచ్ ఉంటాయి. గుజరాత్ రాష్ట్రంలోని కచ్ అనే జిల్లాలో ఉప్పు చిత్తడి నేల ఉంటుంది. అందుకే దీనిని రాన్ ఆఫ్ కచ్ అని పిలుస్తారు. సుమారు 26,000 చదరపు కిలోమీటరలు విస్తరించిన ఉన్న ఈ నేలలోని రాజస్థాన్, గుజరాత్ లలో ఉద్భవించే అనేక నదుల నీరు వస్తుంది. వీటిలో లూని, భుకీ, భారుద్, నారా ఉన్నాయి. సముద్రమట్టానికి దగ్గరగా ఉండే ఇక్కడ ఇసుకతో కూడిన ఎత్తైన ప్రదేశాలు కనిపిస్తాయి.
