Pawan Kalyan Bro Movie: పవన్ కళ్యాణ్ ‘బ్రో’ చిత్రంలో 5 పాటలు..అందులో ఒక ఐటెం సాంగ్..ఇది నిజంగా దేవుడి సినిమానేనా!
త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం తో మాతృక ‘వినోదయ్యా చిత్తం’ కి ఏ మాత్రం సంబంధం లేదని

Pawan Kalyan Bro Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బ్రో’ మూవీ షూటింగ్ కార్యక్రమాలను మొత్తం పూర్తి చేసుకొని జులై 28 వ తారీఖున రీ రిలీజ్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తమిళం లో డైరెక్ట్ ఓటీటీ ద్వారా విడుదలైన ‘వినోదయ్యా చిత్తం’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఆ సినిమాకి దర్శకుడిగా సముద్ర ఖని వ్యవహరించాడు. తెలుగు లో కూడా ఆయనే దర్శకత్వం వహిస్తున్నాడు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం తో మాతృక ‘వినోదయ్యా చిత్తం’ కి ఏ మాత్రం సంబంధం లేదని, కేవలం ఆ సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ ని తీసుకొని మొత్తం మార్చేశారని సాయి ధరమ్ తేజ్ ఇది వరకే మొన్న జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు.
అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది. అదేమిటంటే ఈ చిత్రం లో ఏకంగా 5 సాంగ్స్ ఉన్నాయట. అందులో పవన్ కళ్యాణ్ మీద రెండు సాంగ్స్ ఉంటాయట. ఒక ఐటెం సాంగ్ కూడా ఇందులో ఉంటుందని సమాచారం. తమిళ వెర్షన్ కి పూర్తి బిన్నంగా, ఒక పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రానికి కథని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించాడని.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కచ్చితంగా ఈ చిత్రం గూస్ బంప్స్ రప్పిస్తుందని, ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ దేవుడిగా నటిస్తున్నాడు, సాయి ధరమ్ తేజ్ ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా నటిస్తున్నాడు.ఇప్పటికే వీళ్లిద్దరికీ సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ ని విడుదల చెయ్యగా, వాటికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.