Rajasthan: 5 కోట్లు మిర్చి బడా లాగించేశారు..ఏం కడుపులురా అవ్వీ..
తుఫాన్ ప్రభావం పశ్చిమ రాజస్థాన్ లోని అనేక ప్రాంతాల్లో కనిపిస్తోంది. జోద్పూర్ నగరంలో వర్షపాతం ఇతర జిల్లాల కంటే తక్కువగా ఉంది. కానీ, ఇక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో ఐదు రోజులుగా ఆకాశం కూడా మేఘావృతమై కనిపిస్తోంది.

ఆహార ప్రియులకు ఎప్పటికప్పుడు నోటిలో ఏదో ఒకటి పడితే గాని మనసు ప్రశాంతంగా ఉండదు. కొంత మందికి అయితే సాయంత్రం అయితే చాలు ఏదో ఒక స్నాక్ తీసుకోవాలి అనిపిస్తుంది. ఇక వాతావరణం ఏమాత్రం చల్లగా ఉన్నా, వర్షాలు పడుతున్న కొంత మంది మాత్రం హాట్ హాట్ గా ఏదైనా తిననిదే నిద్రపోరు. అదే చేశారు పశ్చిమ రాజస్థాన్ ప్రాంతంలోని ప్రజలు. ఇక్కడ గత కొద్ది రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తుండడంతో.. వాతావరణం పూర్తిగా మారిపోయింది. చల్లదనంతో కూడిన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న ఇక్కడ ప్రజలు హాట్ హాట్ గా తమకు ఇష్టమైన ఆహార పదార్థాలను వండి తింటున్నారు. ఈ క్రమంలోనే కోటి రూపాయలకు పైగా విలువ చేసే మిర్చీని వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేసుకుని లాగించేసినట్టు చెబుతున్నారు.
సాధారణంగా వర్షాకాలంలో వేడివేడి ఆహార పదార్థాలను తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. వర్షం కురుస్తున్నప్పుడు వేడి పదార్థాలు తింటే కలిగే ఆనందమే వేరు. వర్షాకాలంలో రోడ్లు పక్కన కట్లెట్, మిర్చి బజ్జీలు, పావ్ బాజీ వంటి భిన్నమైన ఆహార పదార్థాలను తీసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో కొద్దిరోజుల నుంచి బైపర్ జోయ్ తుఫాన్ తెగ ఇబ్బంది పెడుతోంది. తుఫాన్ ప్రభావంతో అనేక ప్రాంతాల్లో బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రమాదకరమైన తుఫాను కారణంగా పశ్చిమ రాజస్థాన్ లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రాంతంలో కొద్ది రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో నగరవాసులు వేడివేడిగా వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకుంటూ చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో జోద్ పూర్ లోని ఆహార ప్రియలు ఈ వర్షాలు కురుస్తున్న సమయంలోనే సుమారు కోటి రూపాయల విలువ చేసే మిరప కాయలను వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ స్థాయిలో తినడం మామూలు విషయం కాదు అంటూ పలువురు చెప్పుకుంటున్నారు.
మేఘావృతమై చల్లని వాతావరణం..
తుఫాన్ ప్రభావం పశ్చిమ రాజస్థాన్ లోని అనేక ప్రాంతాల్లో కనిపిస్తోంది. జోద్పూర్ నగరంలో వర్షపాతం ఇతర జిల్లాల కంటే తక్కువగా ఉంది. కానీ, ఇక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో ఐదు రోజులుగా ఆకాశం కూడా మేఘావృతమై కనిపిస్తోంది. దీంతో చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ నచ్చిన వంటకాలను చేసుకుంటూ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. సాధారణంగానే తిండిపై ఈ ప్రాంత ప్రజలకు కాస్త మక్కువ ఎక్కువ. వాతావరణం కూడా అనుకూలించడంతో బజ్జీలు, బోండాలు అంటూ చేసుకుని గట్టిగా లాగించేశారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా తయారు చేసే మిర్చి బడా అనేది కొద్ది రోజులు నుంచి అధికంగా తిన్నట్లు చెబుతున్నారు. జోధ్ పూర్ లో దీనిని ఎక్కువగా తయారు చేస్తుంటారు. మిర్చి, ఉప్పు, 70 మసాలా దినుసులు ఉపయోగించే దీన్ని తయారు చేసి తింటారు. బయట భారీగా విక్రయాలు కూడా చేస్తారు.
దుకాణాల్లో తినేందుకు బారులు..
ఇక ఇళ్లల్లో తినలేని ఎంతో మంది జోద్ పూర్ లోని అనేక ప్రాంతాల్లోని స్వీట్ దుకాణాల్లో కొనుగోలు చేసి తింటున్నారు. ప్రముఖ దుఖాణాలు వద్ద బారులు తీరి కనిపించారు. అందరూ కుటుంబ సమేతంగా తినేందుకు ఇళ్ళకు కట్టించుకోని మరి తీసుకెళ్తూ కనిపించారు. వర్షాకాలంలో వీటి విక్రయాలు జోరుగా సాగుతాయి. సాధారణ రోజులతో పోలిస్తే వర్షాకాలంలో ఐదు నుంచి పది రెట్లు ఎక్కువగా విక్రయాలు ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ వాతావరణం వర్షాకాలం మాదిరిగానే ఉండడంతో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇకపోతే జోద్ పూర్ లోని మిర్చి ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రసిద్ధిగాంచిందని ఇక్కడి వాళ్ళు చెబుతుంటారు. తార్ ఎక్స్ ప్రెస్ ద్వారా పాకిస్తాన్ కు మిర్చి బడా వెళుతుంది. ఆన్లైన్ వ్యాపారం ప్రారంభించిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మిర్చి బడే ఇష్టపడే ప్రజలు ఆర్డర్ చేసుకుంటున్నారు. ఈ మిర్చి బడా జోద్ పూర్ నుండి అనేక దేశాలకు సరఫరా అవుతుండడం విశేషం. ఏది ఏమైనా వాతావరణం ప్రభావంతో ఇక్కడ ప్రజలు ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే మిర్చి బడాను తినడం సాధారణ విషయం కాదని పలువురు పేర్కొంటున్నారు.
