Earthquake in Jaipur : రాజస్థాన్ లో వరుస భూ ప్రంకపంనలు.. కలకలం

జైపూర్ లో ఉదయం 4.09 నుంచి 4.25 మధ్యలో వేరువేరు సమయాల్లో మూడు సార్లు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ప్రజలు గాఢ నిద్రలో ఉండగా భూమి కంపించడంతో భయాందోళన చెందారు. ఆరావళి కొండల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. రిక్టర్ స్కేల్ పై 4.4 గా నమోదైనట్లు నేషనల్ సిస్మాలజీ కేంద్రం వెల్లడించింది.

  • Written By: NARESH
  • Published On:
Earthquake in Jaipur : రాజస్థాన్ లో వరుస భూ ప్రంకపంనలు.. కలకలం

Earthquake in Jaipur : రాజస్థాన్ లోని జైపూర్ లో భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేల్ పై 4.4 గా నమోదైంది. శుక్రవారం తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో కావడంతో అందరు గాఢ నిద్రలో ఉన్నారు. మెలకువగా ఉన్న వారు మాత్రం ఏం జరుగుతుందోనని తెలియక తికమక పడ్డారు. వీధుల్లోకి పరుగులు తీశారు. జన, ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోయినా ప్రజల్లో మాత్రం ఆందోళన పెరిగింది.

జైపూర్ లో ఉదయం 4.09 నుంచి 4.25 మధ్యలో వేరువేరు సమయాల్లో మూడు సార్లు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ప్రజలు గాఢ నిద్రలో ఉండగా భూమి కంపించడంతో భయాందోళన చెందారు. ఆరావళి కొండల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. రిక్టర్ స్కేల్ పై 4.4 గా నమోదైనట్లు నేషనల్ సిస్మాలజీ కేంద్రం వెల్లడించింది.

మొదటి ప్రకంపన 04:09:38కి వచ్చింది. ఇది రిక్టర్ స్కేల్ పై 4.4 తీవ్రతగా నమోదైంది. రెండోది 04:22:57కి కంపించింది. దీని తీవ్రత 3.1గా ఉంది. మూడోది 04:25:33కి నమోదు కాగా దీని తీవ్రత 3.4గా నమోదైంది. ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం మాత్రం రాలేదు. దీంతో ప్రజలందరు ఊపిరి పీల్చుకున్నారు. ఇతర జిల్లాల్లో కూడా భూకంపం సంభవించిన దాఖలాలు ఉన్నాయి.

భూకంప తీవ్రతపై రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె ట్విట్టర్ వేదికగా స్పందించారు. భూకంపం సంభవించిన ప్రాంతాలను సందర్శించి ప్రజలను ఓదార్చారు. భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. నిద్రలో ఉలిక్కిపడి లేచిన విధానంపై అడిగి తెలుసుకున్నారు. ఎవరికి కూడా నష్టం కాకపోవడంపై భగవంతుడి ఆశీర్వాదంగా సెలవిచ్చారు.

Read Today's Latest National politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు