2021 Diwali Movies: టాలీవుడ్ కి దీపావళి ఒక చేదు జ్ఞాపకం !
2021 Diwali Movies: దీపావళి అంటేనే వెలుగుల పండుగ అని అర్ధం. ముఖ్యంగా అమావాస్య చీకట్లను చీల్చుతూ ఎటుచూసినా దీపాల వెలుగులను జీవితాల్లో నింపే పండుగ అని నమ్మకం. కానీ, టాలీవుడ్ కి మాత్రం దీపావళి ఒక చేదు జ్ఞాపకం. ఎప్పటికీ కలిసి రాదు అనే బలమైన నమ్మకంగా నాటుకుపోయింది. గతంలో కూడా దీపావళికి ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా.. అవి పెద్దగా ఆడలేదు. అందుకే, చాలామంది మేకర్స్ దీపావళికి తమ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ […]

2021 Diwali Movies: దీపావళి అంటేనే వెలుగుల పండుగ అని అర్ధం. ముఖ్యంగా అమావాస్య చీకట్లను చీల్చుతూ ఎటుచూసినా దీపాల వెలుగులను జీవితాల్లో నింపే పండుగ అని నమ్మకం. కానీ, టాలీవుడ్ కి మాత్రం దీపావళి ఒక చేదు జ్ఞాపకం. ఎప్పటికీ కలిసి రాదు అనే బలమైన నమ్మకంగా నాటుకుపోయింది. గతంలో కూడా దీపావళికి ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా.. అవి పెద్దగా ఆడలేదు.
అందుకే, చాలామంది మేకర్స్ దీపావళికి తమ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేయరు. కాకపోతే, కరోనా కాబట్టి.. రిలీజ్ డేట్లుకు చాలా సమస్యలు ఉన్నాయి అందుకే.. ఈ దీపావళికి వరుస సినిమాలను వదిలారు. కానీ ఈ సారి కూడా అదే బ్యాడ్ సెంటిమెంట్ విజయవంతంగా కొనసాగింది. దీపావళికి స్పెషల్ గా వచ్చిన 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద తుస్సుమనిపించాయి.
‘మంచి రోజులొచ్చాయి’, పెద్దన్న, ఎనిమీ సినిమాలలో థియేటర్లలో పెద్దన్న దారుణంగా ఫెయిల్ అయింది. ఇక మంచి రోజులొచ్చాయికి ఒక రోజు ముందే ప్రీమియర్లు పడ్డాయి. అయితే మారుతి మార్క్ కామెడీ మిస్సవ్వడం, కథ బేస్ సరిగా లేకపోవడం వల్ల మంచి రోజులకు మార్కెట్ లేకుండా పోయింది. మొత్తానికి మారుతి చేసిన ప్రయత్నం వర్కౌట్ కాలేదు.
Also Read: Bangarraju: రాజమండ్రిలో అడుగుపెట్టనున్న బంగార్రాజు!
ఇక రజనీకాంత్ పెద్దన్నగా పలకరించాడు. 80ల నాటి పరమ రొటీన్ కథతో విసిగించేశాడు. రజనీ ఫ్యాన్స్ కి నచ్చే ఎలిమెంట్స్ ని నమ్ముకుని తీసిన సినిమా ఇది. కానీ వాళ్లకు కూడా ఈ సినిమా నచ్చలేదు. అలాగే విశాల్ చేసిన మరో భారీ సినిమా ఎనిమి. కమర్షియల్ హంగులు లేకపోవడం, లాజిక్ లేని మైండ్ గేమ్ తో సినిమా సాగడం మొత్తమ్మీద ఇది ఫెయిల్ అయింది.
Also Read: Pragya Jaiswal: బాలయ్యతో చేసి తప్పు చేశానా ?