Analysis On Janasena Party : ఏపీలో జనసేన గ్రాఫ్ పెరుగుతోంది. అటు అన్నివర్గాల ప్రజలకు ఆ పార్టీకి దగ్గరవుతోంది. పవన్ కు ఒక్క చాన్సిచ్చి చూడాలన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఆ జాబితాలో ప్రముఖులు సైతం ఉండడం విశేషం. ఇటీవల పవన్ కు మద్దతు తెలిపే వారు ఎక్కువవుతున్నారు. కొన్నిరంగాల ప్రముఖులు బయటకు వెల్లడించకపోయినా అంతర్గత చర్చల్లో మాత్రం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
జనసేన ఆవిర్భవించి సుదీర్ఘ కాలమవుతోంది. కానీ పార్టీ అధికారంలోకి రాలేదు. అలాగని పార్టీని డీ యాక్టివ్ చేయలేదు. ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా పవన్ పనిచేస్తున్నారు. తన సొంత డబ్బులు పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు పంచి పెడుతున్నారు. జనవాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
రాజకీయ పార్టీ నడపడం అంత సులభం కాదు. కానీ పవన్ తన సినిమాల ద్వారా వచ్చిన ఆదాయంతో పాటు ఆస్తులను అమ్మి మరీ పార్టీని నడుపుతున్నారు. దీనిని కొందరు సాఫ్ట్ కార్నర్ లో చూస్తున్నారు.విపరీతమైన ప్రజాభిమానం ఉండి.. ఎంతో సంపాదించుకునే చాన్ష్ ఉన్నా.. పవన్ మాత్రం తనకు ప్రజాసేవ ఇష్టమని భావిస్తుంటారు. రాజకీయాలు అన్నవి పవన్ పాలిట్రిక్స్ కాదని.. ప్రజా సమస్యల పరిష్కారం కోసమేనని నమ్మే వ్యక్తి పవన్. ఆ పాయింట్ ను బేస్ చేసుకునే ఎక్కువ మంది ఆయన్ను ఫాలో అవుతుంటారు.
ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ తోనే మార్పు సాధ్యం.. ఈక్రమంలోనే పవన్ రాజకీయ అడుగులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.