WPL 2023 వేలం : స్మృతి, ఎల్లీస్ కు కళ్ళు చెదిరే ధర.. ఆరుగురిలో ముగ్గురు బెంగళూరుకే.. ఎవరికి ఎంతంటే?

WPL 2023 Auction : భారత క్రికెట్ క్రీడా సమాఖ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహిళల ప్రీమియర్ లీగ్ డబ్ల్యూ పి ఎల్ లో కీలక పరిణామానికి తెరలేచింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఆరెంగేట్ర సీజన్ కు సంబంధించి వేలం మొదలైంది.. ఫస్ట్ సెట్ లో భారత స్టార్ ఆటగాళ్లు స్మృతి, హర్మన్ ప్రీత్ కౌర్, ఎల్లీస్ ఫెర్రీ కోసం ఐదు ప్రాంచై జీలు తీవ్రంగా పోటీపడ్డాయి. స్మృతిని రాయల్ […]

  • Written By: Bhaskar
  • Published On:
WPL 2023 వేలం : స్మృతి, ఎల్లీస్ కు కళ్ళు చెదిరే ధర.. ఆరుగురిలో ముగ్గురు బెంగళూరుకే.. ఎవరికి ఎంతంటే?

WPL 2023 Auction : భారత క్రికెట్ క్రీడా సమాఖ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహిళల ప్రీమియర్ లీగ్ డబ్ల్యూ పి ఎల్ లో కీలక పరిణామానికి తెరలేచింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఆరెంగేట్ర సీజన్ కు సంబంధించి వేలం మొదలైంది.. ఫస్ట్ సెట్ లో భారత స్టార్ ఆటగాళ్లు స్మృతి, హర్మన్ ప్రీత్ కౌర్, ఎల్లీస్ ఫెర్రీ కోసం ఐదు ప్రాంచై జీలు తీవ్రంగా పోటీపడ్డాయి. స్మృతిని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 3.4 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.. వేలంలో తొలి ప్లేయర్ గా స్మృతి పేరు వచ్చింది.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, గుజరాత్, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి.. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన జట్టు కెప్టెన్ గా స్మృతిని భావిస్తూ 3.4 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది..

రెండవ ప్లేయర్ గా హర్మన్ ప్రీత్ కౌర్ రాగా… ఆమెను 1.8 కోట్లకు ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసింది.. న్యూజిలాండ్ జట్టుకు చెందిన సోఫి ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 50 లక్షలకు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ఎల్లీస్ ను 1.7 కోట్లకు కొనుగోలు చేసింది.. మొదటి అంచలో ఆరుగురు ప్లేయర్లు వేలానికి రాగా… అందులో ముగ్గురిని బెంగళూరు జట్టు కొనుగోలు చేయడం విశేషం.

ఇక స్మృతి రాయల్ చాలెంజర్స్ జట్టుకు రావడం పట్ల బెంగళూరు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెంబర్ 18 జెర్సీతో విరాట్ కోహ్లీ, స్మృతి ఇద్దరూ కూడా తమ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని కన్నడ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..ఇక స్మృతి అధిక ధర పలకడం పట్ల మహిళా క్రికెటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టి20 ప్రపంచ కప్ కోసం సౌత్ ఆఫ్రికాలో ఉన్న భారత మహిళా క్రికెటర్లు… ఈ వేళాన్ని టీవీలో వీక్షిస్తూ పండగ చేసుకుంటున్నారు.. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు స్మృతి నాయకత్వం వహించే అవకాశాలున్నాయి.

ఇక బీసీసీఐ వేలం నిబంధనల ప్రకారం ఒక్కో జట్టు దగ్గర 12 కోట్ల పర్స్ మని ఉంది. ఒక్కో జట్టు గరిష్టంగా 18 మందిని, కనిష్టంగా 12 మందిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.. ఇందులో ఆరుగురు విదేశీ ప్లేయర్లు మాత్రమే ఉండాలి. అంతకుమించితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.

– 2023 డబ్ల్యూ.పీఎల్ వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరే..

-స్మృతి మంధాన (బేస్ ధర INR 50 లక్షలు) INR 3.4 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.

-హర్మన్‌ప్రీత్ కౌర్ (బేస్ ధర INR 50 లక్షలు) INR 1.8 కోట్లకు ముంబై ఇండియన్స్‌కు..

-సోఫీ డివైన్ (బేస్ ధర INR 50 లక్షలు) INR 50 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు

-యాష్లీ గార్డనర్ (బేస్ ధర INR 50 లక్షలు) INR 3.2 కోట్లకు గుజరాత్ జెయింట్స్‌కు

-ఎల్లీస్ పెర్రీ (బేస్ ధర INR 50 లక్షలు) INR 1.7 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు

-సోఫీ ఎక్లెస్టోన్ (ప్రాథమిక ధర INR 50 లక్షలు) యూపీ వారియర్స్ కు INR 1.8 కోట్లకు..

-దీప్తి శర్మ (ప్రాథమిక ధర INR 50 లక్షలు) యూపీ వారియోర్జ్‌కు INR 2.6 కోట్లకు

-రేణుకా సింగ్ (బేస్ ధర INR 50 లక్షలు) INR 1.5 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు

-నటాలీ స్కివర్-బ్రంట్ (బేస్ ధర INR 50 లక్షలు) INR 3.2 కోట్లకు ముంబై ఇండియన్స్‌కు

-తహ్లియా మెక్‌గ్రాత్ (ప్రాథమిక ధర INR 40 లక్షలు) యూపీ వారియోర్జ్‌కు INR 1.4 కోట్లకు

-బెత్ మూనీ (ప్రాథమిక ధర INR 40 లక్షలు) INR 2 కోట్లకు గుజరాత్ జెయింట్స్‌కు

– షబ్నిమ్ ఇస్మాయిల్ (ప్రాథమిక ధర INR 40 లక్షలు) యూపీ వారియర్స్ కు 1 కోటి రూపాయలకు

-అమేలియా కెర్ (ప్రాథమిక ధర INR 40 లక్షలు) INR 1 కోటికి ముంబై ఇండియన్స్‌కు

-సోఫియా డంక్లీ (బేస్ ధర INR 30 లక్షలు) గుజరాత్ జెయింట్స్‌కు INR 60 లక్షలకు

-జెమిమా రోడ్రిగ్స్ (బేస్ ధర INR 50 లక్షలు) ఢిల్లీ క్యాపిటల్స్‌కు INR 2.2 కోట్లకు

-మెగ్ లానింగ్ (ప్రాథమిక ధర INR 50 లక్షలు) ఢిల్లీ క్యాపిటల్స్‌కు INR 1.1 కోట్లకు

-షఫాలీ వర్మ (బేస్ ధర INR 50 లక్షలు) ఢిల్లీ క్యాపిటల్స్‌కు INR 2 కోట్లకు

-అన్నాబెల్ సదర్లాండ్ (బేస్ ధర INR 30 లక్షలు) INR 70 లక్షలకు గుజరాత్ జెయింట్స్‌కు

-హర్లీన్ డియోల్ (ప్రాథమిక ధర INR 40 లక్షలు) గుజరాత్ జెయింట్స్‌కు INR 40 లక్షలకు

-పూజా వస్త్రాకర్ (బేస్ ధర INR 50 లక్షలు) ముంబై ఇండియన్స్‌కు INR 1.9 కోట్లకు

-డియాండ్రా డాటిన్ (ప్రాథమిక ధర INR 50 లక్షలు) గుజరాత్ జెయింట్స్‌కు 60 లక్షల రూపాయలకు

-యస్తికా భాటియా (ప్రాథమిక ధర INR 40 లక్షలు) INR 1.5 కోట్లకు ముంబై ఇండియన్స్‌కు

-రిచా ఘోష్ (బేస్ ధర INR 50 లక్షలు) INR 1.9 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు

– అలిస్సా హీలీ (బేస్ ధర INR 50 లక్షలు) యూపీ వారియర్జ్‌కు INR 70 లక్షలకు

– అంజలి సర్వాణి (ప్రాథమిక ధర INR 30 లక్షలు) యూపీ వారియర్స్ కు INR 55 లక్షలకు

-రాజేశ్వరి గయాక్వాడ్ (ప్రాథమిక ధర INR 40 లక్షలు) యూపీ వారియర్స్ కు 40 లక్షల రూపాయలకు

-రాధా యాదవ్ (బేస్ ధర INR 40 లక్షలు) INR 40 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు

– శిఖా పాండే (బేస్ ధర INR 40 లక్షలు) ఢిల్లీ క్యాపిటల్స్‌కు 60 లక్షల రూపాయలకు

– స్నేహ రానా (బేస్ ధర INR 50 లక్షలు) INR 75 లక్షలకు గుజరాత్ జెయింట్స్‌కు

-మారిజానే కాప్ (బేస్ ధర INR 40 లక్షలు) ఢిల్లీ క్యాపిటల్స్‌కు INR 1.5 కోట్లకు

———————–

– *2023 WPL వేలం అమ్ముడుపోని ఆటగాళ్లు*

హేలీ మాథ్యూస్ (ప్రాథమిక ధర 40 లక్షలు)

సుజీ బేట్స్ (ప్రాథమిక ధర 30 లక్షలు)

తజ్మిన్ బ్రిట్స్ (ప్రాథమిక ధర INR 30 లక్షలు)

లారా వోల్వార్డ్ట్ (ప్రాథమిక ధర INR 30 లక్షలు)

టామీ బ్యూమాంట్ (ప్రాథమిక ధర INR 30 లక్షలు)

హీథర్ నైట్ (ప్రాథమిక ధర INR 40 లక్షలు)

సునే లూయస్ (ప్రాథమిక ధర INR 30 లక్షలు)

డాని వ్యాట్ (ప్రాథమిక ధర 50 లక్షలు)

చమరి అతపత్తు (ప్రాథమిక ధర INR 30 లక్షలు)

తానియా భాటియా (ప్రాథమిక ధర 30 లక్షలు)

అనుష్క సంజీవని (ప్రాథమిక ధర 30 లక్షలు)

సుష్మా వర్మ (ప్రాథమిక ధర 30 లక్షలు)

బెర్నాడిన్ బెజుడెన్‌హౌట్ (ప్రాథమిక ధర INR 30 లక్షలు)

అమీ జోన్స్ (ప్రాథమిక ధర 40 లక్షలు)

షామిలియా కన్నెల్ (ప్రాథమిక ధర 30 లక్షలు)

ఫ్రెయా డేవిస్ (ప్రాథమిక ధర 30 లక్షలు)

మేగాన్ షట్ (ప్రాథమిక ధర INR 40 లక్షలు)

జహనారా ఆలం (ప్రాథమిక ధర INR 30 లక్షలు)

లీ తహుహు (ప్రాథమిక ధర INR 30 లక్షలు)

అయాబొంగా ఖాకా (ప్రాథమిక ధర INR 30 లక్షలు)

షకేరా సెల్మాన్ (ప్రాథమిక ధర 30 లక్షలు)

సారా గ్లెన్ (ప్రాథమిక ధర 30 లక్షలు)

నాంకులులేకో మ్లాబా (ప్రాథమిక ధర INR 30 లక్షలు)

పూనమ్ యాదవ్ (ప్రాథమిక ధర 30 లక్షలు)

ఇనోకా రణవీర (ప్రాథమిక ధర 30 లక్షలు)

అలనా కింగ్ (ప్రాథమిక ధర INR 40 లక్షలు)

అఫీ ఫ్లెచర్ (ప్రాథమిక ధర INR 30 లక్షలు)

ఫ్రాన్ జోనాస్ (ప్రాథమిక ధర INR 30 లక్షలు)

లీ కాస్పెరెక్ (ప్రాథమిక ధర INR 30 లక్షలు)

నాడిన్ డి క్లర్క్ (ప్రాథమిక ధర INR 30 లక్షలు)

సల్మా ఖాతున్ (ప్రాథమిక ధర 30 లక్షలు)

జెస్ జోనాసెన్ (ప్రాథమిక ధర 50 లక్షలు)

Read Today's Latest Sports news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube