Ustaad Bhagat Singh: 2 రోజుల్లో 20 మిలియన్ వ్యూస్.. 45 సెకండ్ల వీడియోతో బీభత్సం సృష్టించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’
ఫలితం గా కేవలం మొదటి రోజే ఈ చిత్రానికి 17 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి, ఇక రెండవ రోజు దాదాపుగా మూడు మిలియన్ వ్యూస్ వచ్చాయి, అలా రెండు రోజులకు కలిపి 20 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ప్రాంతీయ బాషా చిత్రాలలో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న సినిమాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నిల్చింది.

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా హరీష్ శంకర్ దర్శకత్వం లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈమధ్యనే హైదరాబాద్ లో ప్రారంభమై ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. మొదటి షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ మీద కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు.
8 రోజులపాటు ఈ సినిమా షెడ్యూల్ కొనసాగగా, పవన్ కళ్యాణ్ కేవలం 5 రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొన్నాడు.ఈ 5 రోజుల షూటింగ్ వర్క్ కి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ ని పూర్తి చేసి ఒక రీసెంట్ గానే ఒక గ్లిమ్స్ వీడియో ని విడుదల చేసారు. ఈమధ్యనే విడుదల చేసిన ఈ వీడియో కి ఫ్యాన్స్ నుండి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, ఆడియన్స్ కి కూడా ఈ గ్లిమ్స్ వీడియో తెగ నచ్చేసింది.
ఫలితం గా కేవలం మొదటి రోజే ఈ చిత్రానికి 17 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి, ఇక రెండవ రోజు దాదాపుగా మూడు మిలియన్ వ్యూస్ వచ్చాయి, అలా రెండు రోజులకు కలిపి 20 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ప్రాంతీయ బాషా చిత్రాలలో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న సినిమాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నిల్చింది.
పవన్ కళ్యాణ్ మార్క్ స్టైల్, డైలాగ్, ఈజ్ మరియు యాటిట్యూడ్ తో సాగే ఈ గ్లిమ్స్ వీడియో ని ఫ్యాన్స్ నాన్ స్టాప్ గా రిపీట్ వేస్తున్నారు. కేవలం 5 రోజులు తీసిన షూటింగ్ లో ఫ్యాన్స్ కి నచ్చే విధంగా ఇన్ని షాట్స్ ఎలా తీసావు స్వామీ అంటూ హరీష్ శంకర్ ని పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు ఫ్యాన్స్. ఇక పొయ్యే కొద్దీ మా ఫ్యాన్స్ కి ఎలాంటి పూనకాలు రప్పించే సన్నివేశాలు తీస్తావో ఇప్పటి నుండే అంచనాలు వేస్తున్నారు , చూడాలి మరి ఎలా తియ్యబోతున్నాడో అనేది.