Tech Companies: రెండు కోట్ల వేతనం.. అయినా కంపెనీలకు దొరకని టెకీలు
సాధారణంగా అధిక వేతనాలు ఉండే ఐటీ పరిశ్రమను నిపుణుల కొరత వేధిస్తోంది. భారీ మొత్తంలో జీతం ఆఫర్ చేస్తున్నప్పటికీ సరైన ఉద్యోగులు లేక ప్రాజెక్టులు చేజారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో అత్యంత చర్చనీయాంశమైన “చాట్ జీపీటీ” ఒకటిగా ఉంది. 2022లో అధికారికంగా సాంకేతిక ప్రపంచానికి పరిచయమైన ఈ టెక్నాలజీ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

Tech Companies: ఆర్థిక మాంద్యం ఇబ్బంది పెడుతోంది.. కొత్త ప్రాజెక్టులు లేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అమెరికా నుంచి యూరప్ మార్కెట్ల వరకు డ్రై పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటప్పుడు ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడం ఉద్యోగులకు తలకు మించిన భారమవుతోంది. పైగా కంపెనీలు కూడా ఆచితూచి వేతనాలు ఇస్తున్నాయి. వేతనాల పెంపును దాదాపుగా నిలిపివేశాయి. కొత్త ఉద్యోగులను తీసుకోవడం లేదు. క్యాంపస్ ప్లేస్మెంట్ ఊసే లేదు. ఇంతటి విపత్కర పరిస్థితులు నెలకొన్న ఐటీ పరిశ్రమలో కోట్లకు కోట్లకు వేతనాలు ఇస్తామని చెప్పినప్పటికీ టెకీలు ముందుకు రావడం లేదు. తమకు కావాల్సిన నైపుణ్యాలు ఉన్న ఐటీ నిపుణులకు రెండు కోట్ల వరకు జీతం చెల్లించేందుకు ముందుకు వస్తున్నప్పటికీ ఎవరూ రావడం లేదని ఐటీ సంస్థలు చెబుతున్నాయి.
సాధారణంగా అధిక వేతనాలు ఉండే ఐటీ పరిశ్రమను నిపుణుల కొరత వేధిస్తోంది. భారీ మొత్తంలో జీతం ఆఫర్ చేస్తున్నప్పటికీ సరైన ఉద్యోగులు లేక ప్రాజెక్టులు చేజారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో అత్యంత చర్చనీయాంశమైన “చాట్ జీపీటీ” ఒకటిగా ఉంది. 2022లో అధికారికంగా సాంకేతిక ప్రపంచానికి పరిచయమైన ఈ టెక్నాలజీ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అయితే దీనిలో వినూత్నమైన ఆవిష్కరణలు తీసుకురావడానికి కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ సాంకేతిక పరిజ్ఞానం లో నిపుణుల కొరత ఉండడం కంపెనీలను ఇబ్బంది పెడుతోంది. ప్రజల నుంచి విపరీతమైన ఆదరణ నేపథ్యంలో చాట్ జిపిటి లో కొత్త కొత్త మార్పులు తీసుకురావాలని కంపెనీలు యోచిస్తున్నాయి. అయితే వాటి అవసరాలకు అనుగుణంగా నిపుణులు లేకపోవడంతో కంపెనీలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో గూగుల్, ఓపెన్ ఏఐ లలో చేసిన చాలామంది టెక్ నిపుణులు గత మూడు నెలల్లో ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎక్కువ జీతాలకు పోటీ కంపెనీలలో చేరిపోతున్నారు. ఇదే సమయంలో మరికొందరు తమ సొంత ఏఐ టెక్నాలజీ ఆధారిత కంపెనీలు ప్రారంభిస్తున్నారు. ఏఐ రంగంలో ప్రముఖ స్టార్టప్ కంపెనీ డాటా బ్రిక్స్.. ఇటీవల మోసాయిక్ ఎంఎల్ ను సుమారు 1.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.
మోసాయిక్ ఎంఎల్ ను ప్రారంభించిన రెండు సంవత్సరాల తర్వాత 1.3 బిలియన్ డాలర్ల విలువతో భారీ లాభాలు సాధించింది. ఫలితంగా చాలామంది టెక్ నిపుణులు టెక్నాలజీ లోకి ప్రవేశించి తమ సొంత కంపెనీని ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నారు. ఇంత డిమాండ్ ఉన్న రంగంలో స్కిల్ ఎంప్లాయిస్ వస్తే కచ్చితంగా 1.5 కోట్ల నుంచి రెండు కోట్ల వేతనంతో ఉద్యోగం లభిస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికాలో వీటి ఆధారంగా పనిచేస్తున్న ఉద్యోగులకు కంపెనీలు లక్షల డాలర్లను వేతనంగా అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ఇక మనదేశంలో కొన్ని కొన్ని కంపెనీలు ఏకంగా మూడు కోట్ల వరకు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఆ స్థాయిలో నిపుణులు లభించడం లేదని కంపెనీలు నిర్వేదం వ్యక్తం చేస్తున్నాయి.
