Pathaan 1st Day Collections : అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఎన్ని ఫ్లాప్ సినిమాలు తీసిన ఒక్కే ఒక్క బ్లాక్ బస్టర్ ఇచ్చినా చాలు రికార్డ్స్ మొత్తం బద్దలు అవుతాయి.. ఇండస్ట్రీ ని మార్కెట్ పరంగా మరో లెవెల్ కి తీసుకెళ్తాయి.. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు గతంలో ఇలాంటివి మనం ఎన్నో చూసాం.. రీసెంట్ గా మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘వాళ్తేరు వీరయ్య’ సినిమాతో ఎలాంటి ప్రభంజనం సృష్టించాడో మన అందరం చూసాం.
ఈ సినిమాకి ముందు ఆయనకీ వరుస ఫ్లాప్స్ ఉన్నాయి.. ఒకేఒక్క హిట్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నింటినీ బద్దలు కొట్టాడు.. సరిగ్గా ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అదే జరిగింది.. ఒకప్పుడు బాలీవుడ్ ని శాసించిన షారుఖ్ ఖాన్ వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో డీలాపడ్డాడు.. తన తోటి హీరోలు ఇండస్ట్రీ రికార్డ్స్ తో చెడుగుడు ఆడుకుంటున్న సమయం లో షారుఖ్ ఖాన్ కి వరుసగా ఫ్లాప్ రావడం ఆయన అభిమానులను ఎంతో బాధకి గురించి చేసింది.
షారుఖ్ హీరోగా నటించిన ఆఖరి చిత్రం ‘జీరో’ 2018 వ సంవత్సరంలో విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది.. దీనితో షారుఖ్ ఖాన్ నాలుగేళ్ల పాటు విరామం తీసుకున్నాడు.. సరైన సబ్జెక్టు కోసం ఎదురు చూసి ‘పఠాన్’ సినిమా చేసాడు.
ఈరోజు ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషలలో విడుదలైంది.. టాక్ అదిరిపోయింది.. ఓపెనింగ్ లో కనీవినీ ఎరుగని రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మొదటి రోజు 140 కోట్ల రూపాయిల వసూళ్లు వచ్చాయి.. చాలాకాలం నుండి సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ కి మళ్ళీ పూర్వ వైభవం తెచ్చింది ఈ చిత్రం.. టాక్ అద్భుతంగా ఉండడం తో రాబోయ్యే రోజుల్లో ఈ సినిమా 500 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఆశ్చర్యం లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.. అలా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో తాను హిట్ ఫామ్ లోకి రావడం మాత్రమే కాకుండా బాలీవుడ్ కి కూడా ఊపిరి పోసాడు.