103 ఏళ్ల వరుడు, 27 ఏళ్ల వధువు…ఇదేం పెళ్లి బాబోయ్

ఇండోనేషియాలో తన కంటే 76 సంవత్సరాల చిన్న వయస్సు గల స్త్రీని వివాహం చేసుకున్న 103 ఏళ్ల వ్యక్తి అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చాడు. 103 ఏళ్ల పువాంగ్ కట్టే 27 ఏళ్ల ఇండో అలంగ్‌ను వివాహం చేసుకున్నాడు. వారి వివాహానికి సంబంధించిన ఫొటోలు ఫేస్బుక్, ట్విట్టర్లలో వైరల్ అయిన తరువాత ఈ వివాహ వివాహానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. స్థానిక మీడియా చెప్పినదాని ప్రకారం పువాంగ్ 1945-1949 మధ్య కాలంలో ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ […]

  • Written By: Neelambaram
  • Published On:
103 ఏళ్ల వరుడు, 27 ఏళ్ల వధువు…ఇదేం పెళ్లి బాబోయ్

ఇండోనేషియాలో తన కంటే 76 సంవత్సరాల చిన్న వయస్సు గల స్త్రీని వివాహం చేసుకున్న 103 ఏళ్ల వ్యక్తి అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చాడు. 103 ఏళ్ల పువాంగ్ కట్టే 27 ఏళ్ల ఇండో అలంగ్‌ను వివాహం చేసుకున్నాడు. వారి వివాహానికి సంబంధించిన ఫొటోలు ఫేస్బుక్, ట్విట్టర్లలో వైరల్ అయిన తరువాత ఈ వివాహ వివాహానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. స్థానిక మీడియా చెప్పినదాని ప్రకారం పువాంగ్ 1945-1949 మధ్య కాలంలో ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ మహిళ బంధువు తనకు పువాంగ్ ఖచ్చితమైన వయస్సు తెలియదని అన్నారు.

తాజాగా ‘ట్రిబ్యూన్ న్యూస్’ ఈ జంట నిజమైన వయస్సును వెల్లడించింది. వధూవరుల వయస్సు మధ్య వ్యత్యాసం తెలుసుకున్న స్థానికులు షాక్ అయ్యారు. వీరిద్దరి పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు పువాంగ్ ఆ అమ్మాయికి ఇచ్చిన కట్నం గురించి కూడా చర్చ జరుగుతోంది. పువాంగ్ నామమాత్రపు మొత్తాన్ని చెల్లించి ఈ వివాహం చేసుకున్నాడు. సుమారు 25 వేల రూపాయలు, బంగారు ఉంగరం ఇచ్చి పువాంగ్ ఈ వివాహం చేసుకున్నట్లు మీడియా వెల్లడించింది.

వివాహం అయిన తరువాత ఈ జంట దక్షిణ సులవేసిలోని పువాంగ్ ఇంటిలో వుంటున్నారు. ఇదిలా ఉండగా ఆడిటీ సెంట్రల్ పేర్కొన్నదాని ప్రకారం 2017 లో కూడా 76 ఏళ్ల మహిళ 16 ఏళ్ల బాలుడిని వివాహం చేసుకుంది. అలాగే 2016 లో జింబాబ్వేకు చెందిన 70 ఏళ్ల మంత్రి కెన్ మాథెమా 23 ఏళ్ల బతాబెట్సో నారాను వివాహం చేసుకున్నాడు.ఇటువంటి పెళ్లిళ్లు చర్చనీయాంశంగా మారుతుంటాయి.

సంబంధిత వార్తలు