Pan Lndia Movies: సౌత్ హీరోల స్థాయి చిన్నది అంటూ హిందీ హీరోలు మొన్నటి వరకు చిన్నచూపు చూసేవారు. అయితే, ప్రస్తుతం తెలుగు హీరోలు ముఖ్యంగా ప్రభాస్. ఎన్టీఆర్, చరణ్ ల స్థాయి బాలీవుడ్ వరకూ పాకింది. హిందీలో షారుఖ్, సల్మాన్ ఖాన్ లాంటి పెద్ద స్టార్స్ కూడా ఇప్పుడు సౌత్ సినిమాల పై సౌత్ దర్శకుల పై పడ్డారు. మరోపక్క సౌత్ హీరోలకు ‘మిడిల్ రేంజ్ బాలీవుడ్ హీరోల’కు మించి ఆధరణ ఇస్తున్నారు హిందీ ప్రేక్షకులు. దానికి తోడు ఇప్పటికే మన తెలుగు స్టార్స్ నటించిన సినిమాలు హిందీ స్టార్ హీరోల సినిమాలను మించి వసూలు చేస్తున్నాయి కాబట్టి.. ఇప్పట్లో తెలుగు స్టార్ హీరోలకు తిరుగు ఉండకపోవచ్చు.
పైగా మనవాళ్ళు తెలుగు సినిమాలు మానుకుని.. హిందీ సినిమాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎలాగూ తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు. కాబట్టి.. ప్రత్యేకంగా వెళ్లి హిందీ సినిమాల్లో నటించాల్సిన అవసరం లేదు. తెలుగు హీరోలకు ఇదే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. మొత్తానికి తెలుగు సినిమా కంటెంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కంటంట్ గా రూపాంతరం చెందింది.
Also Read: Old TV Anchors: ఒకప్పటి ఈ బుల్లితెర యాంకర్స్ గుర్తున్నారా.. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..

Simhasanam
కానీ.. గత తెలుగు సినిమాల పై అవగాహన ఉన్నవాళ్లు దీన్ని అంగీకరించరు. కారణం.. గతంలో కూడా మనవాళ్ళు పాన్ ఇండియా స్థాయి సినిమాలు చేశారు. అప్పట్లో పాన్ ఇండియా కంటెంట్ తో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్లు హిట్లు కొట్టినా.. పాన్ ఇండియా రేంజ్ లో తమ సినిమాని ప్రమోట్ చేసుకునే స్కోప్ ఉండేది కాదు. అందుకే అప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఆ దిశగా అడుగులు వేయలేకపోయారు.
మరి గతంలో వచ్చిన తెలుగు సినిమాల్లో పాన్ ఇండియా కంటెంట్ ఉన్న సినిమాలు ఏవి ? ఆయా సినిమాల్లో ఏ హీరోలు నటించారు ? లాంటి విషయాలు తెలుసుకుందాం రండి.
1. తాండ్ర పాపారాయుడు:

Thandra Paparayudu
కృష్ణంరాజు హీరోగా వచ్చిన ఈ సినిమా 1986 వ సంవత్సరంలో రిలీజ్ అయింది. సీనియర్ ఎన్టీఆర్ కోసం ఈ కథ రాశారు. అయితే, ఎన్టీఆర్ అప్పటికే సీఎంగా ఉండటంతో.. కథ కృష్ణంరాజు దగ్గరకు వెళ్ళింది. ఈ కథలో పాన్ ఇండియాకి రీచ్ అయ్యే కంటెంట్ ఉంటుంది.
2. సింహాసనం :

Simhasanam
సింహాసనం గురించి అప్పటి ప్రేక్షకులు నేటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. సూపర్ స్టార్ కృష్ణగారు నటించి దర్శకత్వం వహించి నిర్మించిన సినిమా ఇది. 1986వ సంవత్సరంలోనే రిలీజ్ అయిన ఈ సినిమాలో కూడా పాన్ ఇండియా రేంజ్ కంటెంట్ ఉంది.
3) ఖైదీ :

Khaidi
మెగాస్టార్ చిరంజీవికి మొదటి సారిగా స్టార్ డమ్ తెచ్చిన సినిమా ఇదే. ఈ సినిమాని కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించారు. 1983లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇది కూడా పాన్ ఇండియా స్థాయి సినిమానే.
4) ఆదిత్య 369 :

Aditya 369
ఈ సినిమా నేటికీ పాన్ ఇండియా కంటెంట్ ఉన్న సినిమానే. సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ లో గ్రేట్ కంటెంట్ ఉంది. 1991లో ఈ మూవీ వచ్చింది. నిజానికి అప్పట్లో హిందీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా పై బాగా ఆసక్తి చూపించారు.
5) జానకి రాముడు :

Janaki Ramudu
నాగార్జున, విజయశాంతి జంటగా నటించిన ఈ సినిమాలో మంచి కథ ఉంది. అందుకే పాన్ ఇండియాకి రీచ్ అయ్యే సినిమాగా ఈ చిత్రం ఈ లిస్ట్ లో చేరింది. రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో 1988లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
6) బొబ్బిలి రాజా :

Bobbili Raja
వెంకటేష్ హీరోగా నిలబడటానికి ఈ సినిమానే ప్రధాన కారణం. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కూడా పాన్ ఇండియాకి రీచ్ అయ్యే కంటెంట్ ఉంది. అందుకే అప్పట్లో ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం బోనీ కపూర్ పోటీ పడ్డారు.
7) గ్యాంగ్ లీడర్:

Gang Leader
మెగాస్టార్ రేంజ్ ను నేషనల్ రేంజ్ లో ఎలివెట్ చేసిన సినిమా ఇది. పైగా చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన ఈ మూవీలో పాన్ ఇండియాకి రీచ్ అయ్యే కంటెంట్ ఉంది. ఈ సినిమాని విజయ్ బాపినీడు డైరెక్ట్ చేశారు. 1991లో ఈ చిత్రం వచ్చింది.
8) సింహాద్రి :

Simhadri
ఒకవిధంగా రాజమౌళి తీసిన మొదటి పాన్ ఇండియా సినిమా కంటెంట్ ఇదే. 2003 లో ఈ మూవీ రిలీజ్ అయ్యింది.. కానీ అప్పట్లో రాజమౌళి ధైర్యం చేయలేకపోయారు గానీ.. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసి ఉంటే.. హిందీలో కూడా రికార్డులు క్రియేట్ చేసి ఉండేది.
9) పోకిరి :

Pokiri
మహేష్ బాబు సినీ కెరీర్ లో పోకిరి ప్రత్యేకం. మహేష్ ను సూపర్ స్టార్ ను చేసిన సినిమా ఇది. పాన్ ఇండియా కంటెంట్ పుష్కలంగా ఉన్న.. ఈ సినిమా పై అప్పట్లో హిందీ ప్రేక్షకులు బాగా ఇంట్రెస్ట్ చూపించారు.
10) మగధీర :

Magadheera
చరణ్ స్థాయిని పెంచిన సినిమా ఇది. అలాగే
రాజమౌళి విజన్ రేంజ్ ను తెలియజేసిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాలో కూడా అద్భుతమైన పాన్ ఇండియా కంటెంట్ ఉంది. అందుకే.. ఈ సినిమాని తమిళ్, మలయాళంలో డబ్ చేసి రిలీజ్ చేశారు. అందుకే ఇది పాన్ ఇండియా సినిమా లిస్ట్ లో చేరింది.
ఏది ఏమైనా పైన చెప్పిన సినిమాలలో ఏ సినిమా అయినా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యి ఉంటే బాగుండేది. బాహుబలి క్రియేట్ చేసిన ప్లాట్ ఫామ్ చాలా ముందుగానే తెలుగు సినిమా చెంతకు చేరేది.
Also Read:Somu Veerraju: ‘శక్తి’ని కూడగడుతున్న సోము వీర్రాజు…బీజేపీ బలోపేతానికి పక్కా స్కెచ్
Recommended Videos: