Bhola Shankar: ఆ ఒక్క ప్రాంతం నుండే 10 కోట్లు..’భోళా శంకర్’ ప్రభంజనం మొదలైంది!

మెగాస్టార్ కి వరుస ఫ్లాప్స్ తర్వాత వచ్చిన సినిమా కావడం తో ఫ్యాన్స్ కి ఈ చిత్రం ఎంతో ప్రత్యేకం. ఈ సినిమా తర్వాత ఆయన మెహర్ రమేష్ లాంటి ఫ్లాప్ డైరెక్టర్ తో ‘భోళా శంకర్’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. తమిళం లో 8 ఏళ్ళ క్రితం విడుదలైన అజిత్ ‘వేదలమ్’ చిత్రానికి ఇది రీమేక్. ఫ్లాప్ డైరెక్టర్ తో రీమేక్ సినిమా అవ్వడం వల్ల ఈ చిత్రం పై అభిమానుల్లో అంచనాలే లేకుండా ఉండేది.

  • Written By: Vicky
  • Published On:
Bhola Shankar: ఆ ఒక్క ప్రాంతం నుండే 10 కోట్లు..’భోళా శంకర్’ ప్రభంజనం మొదలైంది!

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో బాక్స్ ఆఫీస్ వసూళ్లను ఏ రేంజ్ లో కొల్లగొట్టాడో అందరికి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి ఫుల్ రన్ లో దాదాపుగా 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది ఇండస్ట్రీ లోనే ఆల్ టైం నాన్ రాజమౌళి టాప్ 5 మూవీస్ లో ఒకటిగా నిలిచింది.

మెగాస్టార్ కి వరుస ఫ్లాప్స్ తర్వాత వచ్చిన సినిమా కావడం తో ఫ్యాన్స్ కి ఈ చిత్రం ఎంతో ప్రత్యేకం. ఈ సినిమా తర్వాత ఆయన మెహర్ రమేష్ లాంటి ఫ్లాప్ డైరెక్టర్ తో ‘భోళా శంకర్’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. తమిళం లో 8 ఏళ్ళ క్రితం విడుదలైన అజిత్ ‘వేదలమ్’ చిత్రానికి ఇది రీమేక్. ఫ్లాప్ డైరెక్టర్ తో రీమేక్ సినిమా అవ్వడం వల్ల ఈ చిత్రం పై అభిమానుల్లో అంచనాలే లేకుండా ఉండేది.

అయితే రీసెంట్ గా విడుదలైన ‘భోళా మేనియా’ సాంగ్ ఈ చిత్రం పై అంచనాలను భారీ గా పెంచేలా చేసింది. పాట పెద్దగా బాగాలేకపోయిన చిరంజీవి తన గ్రేస్ ఫుల్ డ్యాన్స్ తో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసాడు. మెగాస్టార్ డ్యాన్స్ వేసాడు అంటే బయ్యర్స్ కళ్ళు మూసుకొని సినిమాని భారీ రేట్స్ కి కొనుగోలు చేసేస్తారు.

ఈ సినిమాకి జరుగుతున్నది కూడా అదే. ఈ సినిమా రాయలసీమ మరియు తెలంగాణ ప్రాంతాలు కాకుండా, కేవలం ఆంధ్ర ప్రాంతం లో 55 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. అందులో కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతానికి గాను 10 కోట్ల 80 లక్షల రూపాయలకు ఈ సినిమా అమ్ముడుపోయిందట. మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఈ ప్రాంతం లో 17 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అందుకే ఈ సినిమాని అంత మొత్తానికి అమ్మినట్టు తెలుస్తుంది.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు