గత కొంతకాలంగా ఏపీ రాజధాని అంశం ప్రజలను రెండు భాగాలుగా విడగొట్టింది. జగన్ కి అనుకూల వర్గం, చంద్రబాబు కు అనుకూల వర్గం. అలాగే మీడియా కూడా రెండుగా చీలిపోయింది. వైసీపీని సమర్ధించే మీడియా, టీడీపీకి కొమ్ము కాసే మీడియా. ఏ మీడియా అవాస్తవాలను ప్రసారం చేస్తుందో.. ఏ మీడియా నిజాలను ప్రచారం చేస్తుందో.. ఎవరికి తెలియడం లేదు. కొన్ని మీడియా ఛానళ్ళు జగన్ ప్రతిపాదించిన వైజాగ్ ను సమర్ధిస్తున్నాయి. మరికొన్ని ఛానళ్ళు అమరావతిని రాజధానిగా కొనసాగితే మంచిదని కథనాలను ప్రసారం చేస్తున్నాయి. అసలు ఎవరి మాట నిజమో.. ఎవరి మాట అబద్దమో ప్రజలకే అర్థంకావడం లేదు. ఆ కమిటీ ఇలా అన్నది.. ఈ కమిటీ అలా చెప్పింది అని ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్ళు కథనాలను ప్రసారం చేసి ప్రజలకు అర్ధం కాకుండా చేస్తున్నారు.
Latest News: చైనా ల్యాబ్ లో తయారైన వైరస్.. దేనికోసం చేశారు.. బయటపడుతున్న నిజాలు..
ఈ విషయమై పలు మీడియా ఛానెల్స్ జిఎన్ రావు కమిటీ ఇలా అన్నారు… ఆలా అన్నారని … ఉదరగొట్టేస్తున్నారు. ఇలాంటి తరుణంలో అసలు వైజాగ్ ని రాజధానిగా ఎంపిక చెయ్యడం సబబేనా , లేదా అనే వార్తల సమాధానంగా ఈరోజు జిఎన్ రావు మీడియా ముందుకు వచ్చారు. మరి ఆయన ఈ రాజధాని విషయం గూర్చి ఏమన్నారో ఆయన మాటల్లో విందాం..