ప్రస్తుతం ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడిన విషయం అందరికి తెలిసిందే.. అందుకు రాజధాని మార్పు ప్రధాన కారణం. ఈ నేపధ్యలో రెండు పార్టీల మధ్య అగ్గి రాసుకుంది. ఏపీకి మూడు రాజధానులు ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలకు నిద్ర కరువైంది. అందుకు తగినట్లుగా జగన్ సర్కార్ అడుగులు వేస్తుండటంతో.. చంద్రబాబు సైన్యం మరీ ఫైర్ అవుతున్నారు. రాజధాని విషయం ఇప్పుడు ఢిల్లీకి చేరే పరిస్థితి ఏర్పడింది. ఆ వివరాలను ఒక్కసారి విశ్లేషిద్దాం..
Read More: బాబుగారు దొరికేసారు…వీడియో చూపించి మరి ఉతికేసారు!
ఒక “రాష్ట్ర శాసనమండలి రద్దు” తేలికైన విషయమేమి కాదు. అందుకు కొన్ని విధి విధానాలను పాటించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో కేబినెట్ ఆమోదం, అసెంబ్లీలో చర్చ, మెజారిటీ సభ్యుల ఆమోదం అనంతరం కేంద్ర కేబినెట్ ఆమోదం, లోక్ సభలో బిల్లు పాస్ అవ్వాలి.. చివరిగా రాష్ట్రపతి ఆమోద ముద్ర పడాలి. ఆ ప్రాసెస్ లో ఎక్కడ తేడా జరిగినా.. మండలి రద్దు, రద్దు అయినట్లే..
అయితే ఇక్కడే ఇంకో తిరకాసు ఉంది. కేంద్రాన్ని ప్రసన్నం చేసుకుంటే. వారు అనుకున్నది త్వరగానే సాధింకోవచ్చు. అనగా మండలి రద్దు కావాలన్నా, రద్దును ఆపాలన్నా.. కేంద్రం చేతుల్లోనే ఉంది. కాబట్టి మోడీగారి దర్శనం అవసరం. అందుకు రెండు పార్టీల నేతలు తెగ ఆరాటపడుతున్నట్లు సమాచారం.
Read More: తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఎన్టీఆర్ బాటలో జగన్?
గతంలో మోడీ తీసుకున్న అన్ని నిర్ణయాలకు వైసీపీ జై కొట్టింది. మరోవైపు బీజేపీ మొదటి నుంచి రాజధాని మార్పుపై టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతూ.. వస్తుంది. అలాగే ఏపీలో పాగా వేయాలని బీజేపీ, జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఇన్ని పరిస్థితుల మధ్య “ఏపీ శాసన మండలి రద్దు” ఆ తర్వాత “రాజధాని మార్పు”పై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. అని అందరిలో ఆసక్తి నెలకొన్నది. ఒకరకంగా చెప్పాలంటే మోడీ సర్కారు కి ఇది ఒక గడ్డు సమస్య.
Read More: శాసనమండలి రద్దు కావాలంటే.. ఇది ప్రాసెస్