స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి పెద్ద చిత్రాల దర్శకుడిగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు. నేషనల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇలా పెద్ద హీరోలతోనే సినిమాలు తీశాడు. ఇప్పుడు ఏకంగా తన కెరీర్ లోనే మరో బిగ్గెస్ట్ స్టార్ తో మరో బిగ్ మూవీ తీసేందుకు సన్నద్ధం అవుతున్నాడు.
తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా భారీ పాన్ ఇండియా మూవీ చేయడానికి వంశీ పైడిపల్లి ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తి చేసాడు. ఈ కరోనా సంక్షోభం ముగిసిన తరువత ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వంశీ తన బలహీనతని ధైర్యంగా బయట పెట్టాడు. ఇంతకీ ఈ స్టార్ డైరెక్టర్ బలహీనత ఏమిటంటే.. రచన అట.
తాను స్వతహాగా రచయితను కాకపోవడం సొంతంగా కథలు చేసుకోలేకపోతున్నాను అని, అందుకే తనకి ఎక్కువుగా సినిమాకి, సినిమాకి మధ్య విపరీతమైన గ్యాప్ వస్తోందని మొత్తానికి ఓపెన్ గా ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటూ పోయాడు వంశీ పైడిపల్లి. ఇలా చెప్పడం కూడా గ్రేటే లేండి. ఇక కథల విషయంలో వంశీ మొదటి నుండి వేరే రైటర్ల పై ఆధారపడుతూ వస్తున్నాడు.
కేవలం వంశీకి స్క్రీన్ ప్లే, టేకింగ్, మేకింగ్ పై మాత్రమే పట్టు ఉంది. అందుకే బీవీఎస్ రవి, కొరటాల శివ, వక్కంతం వంశీ, హరి, అహిసోర్ సాల్మన్, ఇంకా కొంతమంది కొత్త రైటర్స్ పై వంశీ ఎక్కువుగా డిపెండ్ అవుతూ వచ్చాడు.