చైనాలో పుట్టిన కరోనా వైరస్ రక్కసి ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వైరస్ వల్ల చైనాలో మృతుల సంఖ్య 25 మందికి చేరింది. మరో 830 మందికి వైరస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. వైరస్ వ్యాప్తి చెందడంతో ఎక్కడి ప్రజలు అక్కడే ఉంచేందుకు చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
మృతుల్లో 24 మంది మధ్య హుబీకి చెందిన వారని చైనా అధికారులు తెలిపారు. మరొకరు హెబీలో చనిపోయారని చెప్పారు. హెబీ బీజింగ్ సరిహద్దులో ఉండటంతో.. రాజధాని ప్రాంతంలో వైరస్ వ్యాప్తి చెందుతుందనే అనుమానాలు నెలకొన్నాయి. మరోవైపు ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 177 మంది పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.
<
Latest News: చైనా ల్యాబ్ లో తయారైన వైరస్.. దేనికోసం చేశారు.. బయటపడుతున్న నిజాలు..
భారత్ లోకి ప్రవేశం…?
ఈ వైరస్ భారత్‌లోకి సైతం ప్రవేశించే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ సోకితే తీవ్రత అధికంగా ఉండడంతో పాటు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం అధికంగా ఉంటుంది. దీని ప్రభావంతో ఇప్పటికే చైనాలో 9 మంది మరణించారు. ఈ నేపథ్యంలో భారత్‌లోకి వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అనారోగ్యకరంగా ఉన్న విదేశీలయులను పరీక్షించాకే బయటికి అనుమతిస్తున్నారు. అయితే, వైరస్ దరి చేరకుండా ఉండాలంటే.. నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కరోనా వైరస్ సోకితే ఈ లక్షణాలు ఉంటాయి…
కరోనా వైరస్ సోకితే జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, ఛాతిలో నొప్పి, వాంతులు తీవ్రంగా ఉంటాయి. ఈ లక్షణాలు తీవ్రమైన న్యుమోనియోకు దారి తీసి ఊపిరాడక మనిషి మరణించే ప్రమాదమూ ఉంటుంది. ఈ లక్షణాలకు చికిత్స చేయడం తప్ప ప్రస్తుతం ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఇప్పటివరకూ జపాన్, థాయ్‌లాండ్, అమెరికాలోనూ వైరస్ బారిన పడ్డవారిని గుర్తించారు. ఈ నేపథ్యంలో చైనాతో పాటు ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కరోనా వైరస్ సోకకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి.
విదేశీ ప్రయాణాలు చేసేవారు తమ సహ ప్రయాణికులతో జాగ్రత్తగా ఉండాలి. జలుబు, గొంతులో గరగర, జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి.. ఎవరికైనా జలుబు చేసినట్టుగా అనిపిస్తే వారిని ముట్టుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. తొలుత ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకినట్లుగా భావిస్తున్నారు. అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు నాణ్యత గల మాస్క్‌లను వాడడం మంచిది.
Latest News: హైదరాబాద్‌లో కరోనా వైరస్ కలవరం.. ఫీవర్ ఆస్పత్రికి మరింత మంది
ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అపరిశుభ్ర చేతులతో ముక్కు, నోరు తాకొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ముఖ్యంగా విదేశీ ప్రయాణం చేసేవారు తరచూ సబ్బుతో చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండడం మంచిది. అంతేకాక, ప్రజా బాహుళ్యం ఎక్కువగా ఉన్న చోట్ల అనవసరంగా ఏ వస్తువులను పడితే వాటిని తాకకూడదు.
కరోనా వైరస్ జంతువుల నుంచే మనుషులకు వ్యాప్తి చెందినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాబట్టి, చైనా సహా వైరస్ ప్రభావిత దేశాలకు వెళ్లేవారు జంతువులకు దూరంగా ఉండడం మంచిది. విదేశాలకు వెళ్లినప్పుడు మాంసాహారం తినే వాళ్లు కొన్నాళ్లపాటు దానికి దూరంగా ఉండడం మేలు.
చైనాలోని ఉహాన్‌లో ఓ సముద్ర మార్కెట్ సమీపం కేంద్రంగా ఈ వైరస్ వ్యాపించినట్లుగా నిపుణులు గుర్తించారు. వైరస్ కారణంగా ఉహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తొలుత వీరి బ్లడ్ నమూనాలను బ్రిటన్‌కు పంపారు. లండన్‌లో వీటిని పరిశీలించి, పరిశోధన జరిపి, ఇది కరోనా వైరస్‌గా గుర్తించారు. కరోనా అంటే లాటిన్ భాషలో కిరీటం అని అర్థం వస్తుంది. పరిశోధనలో భాగంగా ఈ వైరస్‌ను మైక్రోస్కోపులో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో కనిపించిందని, అందుకే దీనికి ఈ పేరు పెట్టినట్లు అంతర్జాతీయ వార్తా పత్రికలు రాశాయి.
Read More: కరోనా:ల్యాబ్ లో తయారు చేసిన వైరస్.. షాకింగ్ విషయాలు!