యష్‌తో జనగణమన మూవీ చేయనున్న పూరి

ఇస్మార్ట్‌శంకర్ చిత్రంతో తిరిగి విజయాల బాట పట్టారు పూరి జగన్నాథ్. తాజాగా కన్నడ హీరో యష్‌తో పూరి జగన్నాథ్ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది. కేజీఎఫ్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు యష్ అతడితో జనగణమన పేరుతో ఓ పాన్ ఇండియన్ సినిమాను పూరి జగన్నాథ్ తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది. తొలుత ఇదే టైటిల్‌తో మహేష్‌బాబు హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్లు పూరి జగన్నాథ్ ప్రకటించారు.

అనివార్య కారణాల వల్ల ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు. సమకాలీన పరిస్థితులకు తగినట్లుగా స్క్రిప్ట్‌లో మార్పులు చేసిన పూరి జగన్నాథ్ ఇటీవలే కథను యష్‌కు వినిపించినట్లు తెలిసింది. ఇటీవలకాలంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న హత్యాచార ఘటనలు, నేరాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలిసింది. తెలుగు, కన్నడ భాషల్లో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.