గాంధీ జయంతి రోజు ‘వార్’

ఒక్క హీరో స్క్రీన్ పై ఉంటేనే ఎంతో సందిగా ఉంటుంది. అలాంటిది ఇద్దరు హీరోలూ.. అందులోనూ హంక్ బాడీస్.. వార్ కు దిగితే.. రెండు కళ్ళూ సరిపోవు అంతే. అలాంటి ఇద్దరు హీరోలు ఇప్పుడు సందడి చేయడానికి రెడీ అవుతున్నారు.ఆ హీరోలు ఎవరో కాదు. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్.

యాక్షన్ హీరోలు హృతిక్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘వార్’. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అత్య‌ద్భుత ఫైటింగ్ స‌న్నివేశాల‌తో.. బైక్‌లు, హెలికాప్ట‌ర్లు, కార్లతో చేజింగ్ సీన్లు థ్రిల్ పుట్టించాయి. యాక్ష‌న్ హీరోలు ఇద్ద‌రూ త‌మ స్టంట్ స్కిల్స్‌తో దుమ్మురేపారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేసారు చిత్ర యూనిట్. గాంధీ జయంతి రోజు (అక్టోబర్ 2) న ‘వార్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా పూర్తి యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమానుయష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వాణి కపూర్ ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. మరి ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయి లోనే వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా రీచ్ అవుతుందో? లేదో చూద్దాం..?

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.