మిషన్‌ మంగళ్‌ ట్రైలర్‌

‘పరిశోధనలు లేనిదే సైన్స్‌ లేదు. పరిశోధనలు చేయకుండా మనకి మనం శాస్త్రవేత్తలం అని చెప్పుకోలేం’ అంటున్నారు బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిషన్‌ మంగళ్‌’. జగన్‌శక్తి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. 2013లో భారత్‌ చేపట్టిన ‘మంగళ్‌యాన్‌‌’ మిషన్‌ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. మంగళ్‌యాన్‌ ఉపగ్రహాన్ని అంగారకుడిపైకి పంపించాలని శాస్త్రవేత్త రాకేశ్‌ ధావన్‌ (అక్షయ్‌) ప్రతిపాదన తెస్తారు. ‘ఇది చేయడానికి మనకు అనుభవజ్ఞులు కావాలి సర్‌’ అని శాస్త్రవేత్త అయిన తారా షిండే(విద్యా బాలన్)‌.. రాకేశ్‌తో అంటారు. ఇందుకు రాకేశ్‌ స్పందిస్తూ.. ‘అంగారకుడిపైకి వెళ్లడానికి ఇస్రోలో ఎవరికి అనుభవం ఉంది. ఏదేమైనా మంగళ్‌యాన్‌ను మార్స్‌పైకి పంపి తీరాల్సిందే’ అంటారు. ఆ తర్వాత శాస్త్రవేత్తలంతా కలిసి భారతదేశ చరిత్రలో నిలిచిపోయిన ఈ ఘట్టాన్ని ఎలా సాధించారన్నది తెరపై చూడాలి. ఆగస్టు 15న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.