చెలరేగిన కోహ్లీ... ఖాతాలో మ‌రో రికార్డు

దక్షిణాఫ్రికాతో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో సెంచరీ బాదిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డ్‌ల్లో చోటు దక్కించుకున్నాడు. మ్యాచ్‌లో రెండో రోజైన శుక్రవారం లంచ్ విరామానికి విరాట్ కోహ్లి (104 బ్యాటింగ్: 183 బంతుల్లో 16x4) శతకం బాదడంతో భారత్ జట్టు 356/3తో మెరుగైన స్థితిలో నిలిచింది. విరాట్‌తో పాటు క్రీజులో అజింక్య రహానె (58 బ్యాటింగ్: 161 బంతుల్లో 8x4) ఉండగా.. ఈరోజు చివరి సెషన్‌‌లో ఆఖరి అరగంట వరకూ భారత్ జట్టు బ్యాటింగ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

పుణె టెస్టులో శతకం ద్వారా టెస్టు కెరీర్‌లో 26వ శతకం మార్క్‌ని అందుకున్న విరాట్ కోహ్లీ.. సొంతగడ్డపై ఎట్టకేలకి దక్షిణాఫ్రికాపై తొలి సెంచరీ నమోదు చేశాడు. ఇక కెప్టెన్‌గా కోహ్లీకి ఇది 19వ టెస్టు శతకంకాగా.. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ సరసన కోహ్లీ నిలిచాడు. టెస్టుల్లో కెప్టెన్‌గా అత్యధిక శతకాలు బాదిన బ్యాట్స్‌మెన్‌గా దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 25 శతకాలతో నెం.1 స్థానంలో ఉండగా.. రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీ సంయుక్తంగా 19 శతకాలతో రెండో స్థానంలో నిలిచారు.

టెస్టుల్లో అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 26వ టెస్టు శతకం అందుకున్న నాలుగో క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లీ 138 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకోగా.. రికార్డ్‌‌‌లో డాన్ బ్రాడ్‌మన్ 69 ఇన్నింగ్స్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక రెండో స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ (121 ఇన్నింగ్స్‌ల్లో) ఉండగా.. మూడులో సచిన్ టెండూల్కర్ (136), ఐదులో సునీల్ గవాస్కర్ (144), ఆరులో మాథ్యూ హెడెన్ (145) ఉన్నారు.

పుణె టెస్టులో దక్షిణాఫ్రికాపై అజింక్య రహానెతో కలిసి నాలుగో వికెట్‌కి ఇప్పటికే అజేయంగా 158 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్ కోహ్లీ.. 1996-97 నాటి ద్రవిడ్ -గంగూలీ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. అప్పట్లో ద్రవిడ్ - గంగూలీ జోడీ.. నాలుగో వికెట్‌కి 145 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక రికార్డ్‌లో వారి తర్వాత వీరేంద్ర సెహ్వాగ్- బద్రీనాథ్ 2009-10లో 136 పరుగులతో మూడో స్థానంలో ఉన్నారు.

టెస్టుల్లో అత్యధిక సెంచరీల రికార్డ్‌లోనూ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజిమామ్ ఉల్ హక్‌ 25 శతకాల రికార్డ్‌ని కోహ్లీ అధిగమించాడు. ఇంజిమామ్ 120 టెస్టుల్లో మొత్తం 200 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 25 శతకాల మార్క్‌ని అందుకోగా.. కోహ్లీ కేవలం 81 టెస్టుల్లోనే 138వ ఇన్నింగ్స్‌తో 26 సెంచరీలు బాదడం విశేషం.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.
 

Most Viewed

ఈ దేశంలో మోడీ ఒక్కడే హిందునా..? కెసిఆర్ కీలక వ్యాఖ్యలు

అమెరికాలో మహేష్ కి సర్జరీ, ఐదు నెలలు రెస్ట్!

మున్సిపల్ ఎన్నికల్లో తెరాస జాతీయ స్థాయి రికార్డు

జబర్దస్త్ యాంకర్ రష్మి 'సిస్టర్' ఫొటోస్.. చూస్తే మీరు షాక్ అవ్వలిసిందే

లైవ్ స్పీచ్: కెసిఆర్ ప్రెస్ మీట్

జనసేన లాంగ్ మార్చ్ వాయిదా..!

రవితేజ రేర్ ఫోటోలు: అసిస్టెంట్ స్థాయి నుండి హీరో రేంజ్..!

అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో జగన్ స్థానం ఎంతో తెలుసా..?

పవన్‌ కల్యాణ్‌-క్రిష్ సినిమాకి హీరోయిన్‌ ఫిక్స్‌!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తెరాస జోరు

సారూ.. అప్పుడు గెలిచారు.. హామీలు మరిచారు..ఇప్పుడైనా జర దెఖో..

హైదరాబాద్ ఇంటర్ విద్యార్థిని హత్య.. మిస్టరీ వీడింది

సిరిసిల్లలో తెరాసకి షాక్ ఇచ్చిన ఇండిపెండెంట్లు

మద్యాహ్నం 3 గంటలకు మీడియాతో మాట్లాడనున్న సీఎం కేసీఆర్‌

తెలంగాణలో మున్సిపల్ ఫలితాలు..కొనసాగుతున్న కారు హవా..

పార్టీ శ్రేణులతో కేటీఆర్.. సంబరాలకు తెరాస ఏర్పాట్లు..

డిస్కోరాజా ఫస్ట్ డే కలెక్షన్స్

అప్పుడు క్రికెట్ లో చుక్కలు చూపించాం...ఇప్పుడు ఆర్థికంగా..:ఇమ్రాన్

బీజేపీకి 80 మంది నేతలు గుడ్ బై

మహేష్ బాబు వాడే లగ్జరీ కార్లు ఇవే..!