వినయ విధేయ రామ పదిరోజుల కలెక్షన్స్

వినయ విధేయ రామ సినిమా పాజిటివ్ బజ్ తో రిలీజైనా.. రిలీజ్ తరువాత ఆ స్థాయి పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయింది. భారీ హిట్ అవుతుంది అనుకుంటే.. టాక్ వ్యతిరేకంగా రావడంతో.. పరాజయం పాలైంది. కలెక్షన్ల విషయంలో మాత్రం సినిమా పర్వాలేదనిపించింది. పదిరోజుల్లో ఈ సినిమా రూ. 60 కోట్ల రూపాయలకు పైగా షేర్ ను వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో ముప్పై కోట్లు రావాలి. ఇది సాధ్యం అయ్యే పనికాదు. లాంగ్ రన్ లో మరో మూడు నాలుగు కోట్లు వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

  పదిరోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎలాంటి కలెక్షన్లు వచ్చాయో ఇప్పుడు చూద్దాం.
 • నైజాం : రూ.12.50 కోట్లు
 • సీడెడ్: రూ. 11.54 కోట్లు
 • ఉత్తరాంధ్ర: రూ. 8.06 కోట్లు
 • కృష్ణ: రూ. 3.55 కోట్లు
 • గుంటూరు:రూ. 6.27 కోట్లు
 • ఈస్ట్ : రూ.5.22 కోట్లు
 • వెస్ట్: రూ.4.26 కోట్లు
 • నెల్లూరు: రూ.2.76 కోట్లు
 • టోటల్: రూ. 54.16 కోట్లు (తెలుగు రాష్ట్రాలు)
 • రెస్ట్ అఫ్ ఇండియా : రూ.5.36 కోట్లు
 • ఓవర్సీస్: రూ.1.43 కోట్లు
 • వరల్డ్ వైడ్ టోటల్ (షేర్): రూ. 60.95 కోట్లు
 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
  Please submit your comments.