అర్జున్ రెడ్డిని మించి వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్‌లుక్

ఇటీవలే 'డియర్ కామ్రేడ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి కాస్త నిరాశ చెందిన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఈ సారి మరింత స్ట్రాంగ్‌గా దిగాలని ఫిక్స్ అయ్యాడు. ఈ మేరకు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కొత్త సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు.

విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. చేతిలో సిగరెట్ పట్టుకుని ముఖం నిండా రక్తంతో కారుతున్న దెబ్బలతో విజయ్ కోపంగా చూస్తున్నట్లుగా ఉన్న ఈ లుక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై వల్లభ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్‌లుక్ కాస్త అర్జున్ రెడ్డి పోస్టర్‌ను తలపిస్తోంది. అందులోనూ విజయ్ లుక్ ఇంచు మించు ఇలాగే ఉంటుంది.

మరి అర్జున్ రెడ్డి స్థాయిలోనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంటుందో లేదో చూడాలి. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అన్న టైటిల్‌తోనే సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో విజయ్ ఏకంగా నలుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నారు. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇసబెల్ లీత్, కేథరిన్ ఇందులో విజయ్‌కు జోడీగా నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ నటిస్తున్న తొమ్మిదో చిత్రమిది.



 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.