జనసేనకు తలవంచిన ట్విట్టర్

జనసేన పార్టీ కార్యకర్తల ట్విట్టర్ అకౌంట్ ల సస్పెన్షన్ పై జనసేన చేసిన ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. కార్యకర్తలకు సంబంధించిన 400 ట్విట్టర్ అకౌంట్లను తిరిగి పునఃరుద్దరించినట్టు ట్విట్టర్ ఇండియా పేర్కొంది. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్ లో స్పందిస్తూ ట్విట్టర్ ఇండియాకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్విట్టర్ పై జనసేన ఉద్యమం

ఇటీవల తమ కార్యకర్తల అకౌంట్ లను సస్పెండ్ చెయ్యడం పై ట్విట్టర్ ఇండియా పై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ప్రజాసమస్యలపై స్పందించడం మా కార్యకర్తలు చేసిన తప్పా? అని ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా #BringBackJSPSocialMedia అనే హాష్ టాగ్ ని ఓపెన్ చేసి పోరాటం చేశారు. ఈ విషయం పై ట్విట్టర్ అధికార ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ప్రజా అభిప్రాయ ప్రకటనకు తమ కంపెనీ కట్టుబడి ఉందన్నారు. అయితే ఈ వేదిక నిబద్ధతను , విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నాలు ట్విట్టర్ నిబందనలకు విరుద్ధమని అన్నారు.

అసలెందుకు సస్పెండ్ చేశారు?

నల్లమల అడవులలో యురేనియం తవ్వకాల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల జనసేన కార్యకర్తలు కొన్ని ఫొటోస్ మరియు వీడియోస్ ని ట్వీట్ చేశారు. యురేనియం తవ్వకాలు జరిపితే జరిగే నష్టాలను వివరిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ట్వీట్స్ చేసారు . ఈ కారణం గానే ట్విట్టర్ తమ కార్యకర్తలకు సంబందించిన 400 అకౌంట్ లను సస్పెండ్ చేసి వుంటారని జనసేన భావిస్తోంది.

ఎట్టకేలకు అకౌంట్ లు అన్ని మళ్ళి తిరిగి పునఃరుద్దరించడంపై జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.