సమ్మెపై కేంద్రం జోక్యం చేసుకోవాలి:ఆర్టీసీ ఐకాస డిమాండ్!

టీఎస్ఆర్టీసీ కార్మికులు తిరిగి ఉద్యోగంలో చేరేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు నేటితో ముగుస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ ఐకాస తదుపరి కార్యా చరణ నిమిత్తం విద్యానగర్‌లోని ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో అఖిలపక్షం నేతలతో సమావేశమైంది. భవిష్యత్‌ కార్యాచరణపై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి కోదండరాం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌, భాజపా నేత మోహన్‌రెడ్డి, ప్రజా, కార్మిక సంఘాల నేతలు హాజరయ్యారు.

టీఎస్ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా దిల్లీలోని తెలంగాణ భవన్‌లో సీపీఎం అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా నిర్వహించింది. ఆర్టీసీ సమ్మెపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, టీఎస్‌ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వాటాను ప్రకటించాలని డిమాండ్‌ చేసింది.

 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.