ఆర్టీసీ బంద్ తో.. ఆటోల, అడ్డగోలు దోపిడీ!

తెలంగాణ ఆర్టీసీ బంద్ తో ప్రజలు ఒకవైపు ఇబ్బందులు పడుతుంటే దొరికిందే సందు అని ఆటోవాళ్ళు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. రాష్ట్ర మంతా ఇలానే ఉంటె.. హైదరాబాద్ లో ఈ దోపిడీ మరీ ఎక్కువైంది. ఒక కిలోమీటర్ కి అక్షరాలా రూ.60 నుండి రూ.70 అడుగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందొ ఊహించుకోవచ్చు

ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. మెట్రో సర్వీసులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అదే సమయంలో మెట్రో సర్వీసులు లేని మార్గాలు, ఇతర ప్రాంతాల్లో ప్రజలు ఆటోల మీద ఆధారపడుతున్నారు. దీంతో ఆటో డ్రైవర్లు ప్రయాణికుల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు.

సమ్మె ప్రభావంతో హైదరాబాద్‌లో ప్రయాణికులను ఆటోవాలాలు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. గత 10 రోజుల నుంచి ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. అసలు మీటర్ అనే మాటను పక్కనపెట్టేశారు. ప్రయాణికులను ఎంతగా దోచుకుంటున్నారనే దానికి ఉదాహరణగా ఓ ప్రయాణికుడు ‘ఖైరతాబాద్ నుంచి ఎర్రమంజిల్ వరకు వెళ్లడానికి ఆటో అడిగా. ఆటో డ్రైవర్ రూ.70 అడిగారు. కేవలం కిలోమీటర్ దూరం మాత్రమే ఉంది. అంత ఎందుకంటే.. బస్సుల్లేవ్. అనే సమాధానం వచ్చింది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌లో మెట్రో రైలు ఎక్కితే రూ.10 లోపే ఎర్రమంజిల్ చేరుకోవచ్చు. కానీ, ఆటో డ్రైవర్లు రూ.60, రూ.70 వసూలు చేస్తున్నారు.’ అని ఓ ప్రయాణికుడు తెలిపాడు. తెలంగాణలో ఇవాళ్టి నుంచి ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు కూడా నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో ఆటోవాలాల దోపిడికీ మరింత అడ్డు లేకుండా పోతోంది.

 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.