కలెక్షన్లలో రికార్డు సాధించిన 'ది లయన్‌ కింగ్‌'

'ఫ్రోజన్‌' సినిమా ఆల్‌టైమ్‌ రికార్డులను అధిగమించి ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా 'ది లయన్‌ కింగ్‌' కొత్త చరిత్ర లిఖ్కించింది. ప్రపంచ బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటి వరకూ 'ఫ్రోజన్‌' 1.27 బిలియన్‌ డాలర్లు కలెక్ట్‌ చేసి అత్యధికంగా గ్రాస్‌ కలెక్ట్‌ చేసిన యానిమేటెడ్‌ మూవీగా నిలిచింది. ఇప్పటి వరకూ కలెక్షన్ల విషయంలో ఈ సినిమాను మించినది లేదనుకున్నారంతా. కానీ తాజాగా ఈ సినిమా స్థానంలో 1.33 బిలియన్‌ డాలర్ల గ్రాస్‌ కలెక్షన్లతో 'ది లయన్‌ కింగ్‌' నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద యానిమేటెడ్‌ చిత్రాలు బిలియన్‌ డాలర్లు కలెక్ట్‌ చేసినవి లేవంటే లేవు అన్నారు అంతా. అప్పటి ఇప్పటికీ ఆ ఒక్కటే. అదే 'ఫ్రోజన్‌'. ఆ సినిమా రికార్డులను ఏ చిత్రమూ బద్దలకొట్టలేకపోయింది. 2013 నుంచి ఇప్పటి వరకూ ఆ చిత్రానిదే రికార్డు. కానీ 2019 బాక్సాఫీస్‌ రికార్డుల్లో కొత్త అధ్యాయం మొదలైంది. ఆ చిత్రానికి మించిన సినిమాగా 'ది లయన్‌ కింగ్‌' సత్తా చాటింది. డిస్నీ రూపొందించిన ఈ చిత్రం 1994లో వచ్చిన క్లాసిక్‌ మూవీ 'ది లయన్‌ కింగ్‌'ని రీమేక్‌ చేసి, కొత్త హంగులు అద్ది తెరకెక్కించారు దర్శకుడు జాన్‌ ఫేవ్‌రో.

ఆయన ఈ చిత్రానికి కేవలం దర్శకుడు మాత్రమే కాదు నిర్మాత కూడా. ఆయనతో పాటు జెఫ్రీ సిల్వర్‌, కరెన్‌ గిల్‌క్రిస్ట్‌ సంయుక్తంగా నిర్మించారు. వాల్ట్‌ డిస్నీ స్టూడియోస్‌ మోషన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో విడుదల చేశారు. అమెరికాలో ఈ చిత్రం జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేశారు. దేశీయంగా, ప్రాంతీయంగా ప్రముఖ నటులతో ఆ సినిమాలో జంతువుల పాత్రలకు డబ్బింగ్‌ చెప్పించి ఆయా ప్రాంతాల్లో విడుదల చేశారు. బాలీవుడ్‌లో షారుక్‌, అతని కొడుకు అయాన్‌ చెప్పారు. తెలుగులో అయితే వెంకటేశ్‌, రానా, నాని, అలీ, బ్రహ్మానందం వంటి వారితో ఈ చిత్రంలో పాత్రలకు డబ్బింగ్‌ చెప్పించి ప్రాంతీయంగా ఆదరణ లభించేలా సన్నాహాలు చేసి విడుదల చేశారు. దీంతో సినిమా కూడా ఆకర్షించేలా ఉండడంతో బాక్సాఫీస్‌ వద్ద భారీ ఎత్తున కాసులు కురిపించింది. ఏకంగా 1.33 బిలియన్‌ డాలర్లు కలెక్ట్‌ చేసింది. దేశీయంగా ఉత్తర అమెరికాలో 473.10 మిలియన్‌ డాలర్లు రాబట్టి నాన్‌ మార్వెల్‌, నాన్‌ స్టార్‌ వార్‌ ఫిల్మ్స్‌లో అత్యధిక కాసులు కురిపించిన చిత్రంగా ఇదే నిలవడం మరో హైలైట్‌.

క్రిస్‌ బుక్‌, జెన్నీఫర్‌ లీ దర్శకత్వంలో 2013లో వచ్చిన యానిమేటెడ్‌ సినిమా 'ఫ్రోజన్‌' అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ఈ చిత్రమూ వాల్ట్‌ డిస్నీ యానిమేటెడ్‌ మోషన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లోనే విడుదలైంది. 150 మిలియన్‌ డాలర్లతో రూపొందిన ఈ సినిమా 1.27 బిలియన్‌ డాలర్లు కలెక్ట్‌ చేసి ప్రపంచ రికార్డులలోకి ఎక్కింది. 'ది లయన్‌ కింగ్‌' కొత్త రికార్డులు లెక్కించడంతో ఈ సినిమా రెండో స్థానంలో నిలిచింది.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.