బండారు దత్తాత్రేయకు పౌర సన్మానసభ

హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయకు ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు రవీంద్రభారతిలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తొలి పౌర సన్మానసభ నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ తెలిపారు. మంగళవారం బీసీ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సన్మానసభకు ముఖ్యఅతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం తదితరులు హాజరవుతారని తెలిపారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు భిక్షపతి, సతీష్‌ పాల్గొన్నారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.