థమన్ దూకుడికి కారణం..? ఆ.. అక్షరమేనా!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న థమన్ SS పూర్తి పేరు "ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్". మొన్నటివరకు తెరమీద SS థమన్ గా పేరువేయించుకున్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఈమధ్య థమన్ S గా మర్చి వేయిస్తున్నాడు.

పేరు మార్పులో వచ్చిన కారణమో... ఏమో గాని చేతినిండా సినిమాలతో తెలుగు ప్రేక్షకులని తన సంగీతంలో ముంచేయడానికి సిద్దమయ్యాడు. అల‌ వైకుంఠ‌పురములో, వెంకీ మామ, డిస్కోరాజా, ప్రతిరోజు పండగే, మిస్ ఇండియా వంటి వరుస సినిమాలతో చాల హుషారుగా ఉన్నాడు. ఇతను ఒక్క తెలుగు సినిమాలకే కాకుండా తమిళ్ లో కూడా బిజీగానే ఉన్నాడు.

రాబోయే సినిమాల నుంచి రిలీజ్ అవుతున్న ప్రతి వీడియో యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సృష్టిస్తూ కామెంటర్స్ చేత శభాష్ అనిపించుకుంటున్నాయి. ఈ మధ్య రిలీజ్ ఆయిన అల‌ వైకుంఠ‌పురములో సాంగ్స్ అయితే ఒక్కో వీడియోకి 100 మిలియన్స్ వ్యూస్ పైగా తెచ్చుకున్నాయి.

తన పేరులో ఒక అక్షరం తగ్గిన తరువాత ఈ దూకుడు మరింత ఎక్కువైనట్టుగా ఉంది. వరుస సినిమాలతో రాబోతున్న థమన్ S, తన పేరు బలం ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి మరి.

 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.