తెలంగాణకు భారీ వర్ష సూచన

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బెంగాల్‌ దక్షిణం, ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. దీంతో 7.6కి.మీల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది రాగల 48గంటల్లో మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో వచ్చే మూడు రోజుల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మంగళ, బుధవారాల్లో చాలాచోట్ల, గురువారం అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మంగళవారం తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.