తెలంగాణ బంద్ విజయవంతం.. రేపు కూడా కొనసాగిస్తాం..:అశ్వత్థామ

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో చర్చలకు ఆస్కారం లేదని ముఖ్యమంత్రి ప్రకటించినా, హైకోర్టు మాత్రం చర్చలు జరపాల్సిందేనని ఆదేశించిన విషయం తెల్సిందే.. ఈ రోజు ఉదయం చర్చలు ఆరంబించాలని హైకోర్టు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం మొండికేసింది. లిఖితపూర్వక ఉత్తర్వులు వచ్చాక ఆలోచిద్దామని ప్రభుత్వం భాదిస్తోందని సమాచారం.

తెలంగాణ బంద్‌ సంపూర్ణంగా విజయవంతం అయిందన్నారు ఆర్టీసీ జెఎసి నేత అశ్వద్దామరెడ్డి. తెలంగాణ బంద్ కు సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు ఆయన. అయితే ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేస్తున్నవారిని అక్రమంగా అరెస్ట్‌ చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. అరెస్ట్‌ చేసినవారిని బేషరతుగా విడుదల చేయాలని అశ్వత్థామరెడ్డి డిమాండ్‌ చేశారు. కెసిఆర్ దిగొచ్చే వరకు ఆర్టీసీ సమ‍్మె యథావిథిగా కొనసాగుతుందని ఆయన చెప్పారు.

ఆర్టీసీ సమ్మెకు ఇప్పటికే ఆటో యూనియన్లు, క్యాబ్‌ డ్రైవర్లు కూడా మద్దతు ప్రకటించారు. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. భాగ్యనగరంలో సుమారు లక్ష వరకు ఆటోలు ఉన్నాయి. 50 వేల క్యాబ్‌లు ఉన్నాయి. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా వీరందరూ సేవలు నిలిపివేయనున్నారు.

 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.