టీసీఎస్ ఉద్యోగిని ఆత్మహత్య.. సీసీటీవీలో దృశ్యాలు

టీసీఎస్ సంస్థలో హెచ్ ఆర్ విభాగంలో పనిచేస్తున్న యువతి, మియాపూర్‌లో తాను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని కె. మహతి(28)గా గుర్తించారు. ఆమె గచ్చిబౌలిలోని టీసీఎస్‌లో హెచ్‌ఆర్ విభాగంలో పని చేస్తున్నారు. మంగళవారం (సెప్టెంబర్ 24) సాయంత్రం నగరంలోని మదీనాగూడలో తాను నివాసం ఉంటున్న ల్యాండ్‌మార్క్ అపార్ట్‌మెంట్‌‌లో ఐదో అంతస్తు నుంచి దూకి ఆమె ఆత్మహత్య చేసుకున్నారు.

సీసీటీవీలో దృశ్యాలు

మహతి వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకుందని.. ఘటనా స్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు వెల్లడించారు. మహతి ఆత్మహత్య చేసుకున్న సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.