సూపర్ స్టార్ మహేశ్ ‘హంబుల్‌’ లాంచ్‌

సూపర్‌స్టార్ మహేష్ బాబు ఒక పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు వ్యాపార రంగంలోనూ తన సత్తా చాటుతున్నారు. ఈ మధ్యనే మల్టీప్లెక్స్‌ రంగంలోకి అడుగుపెట్టి గచ్చిబౌలిలో విలాసవంతమైన ‘ఏఎమ్‌బీ’ సినిమాస్‌ పేరుతో ఓ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ స‌రికొత్త వ‌స్త్ర ప్ర‌పంచంలోకి మ‌నల్ని తీసుకెళ్ల‌నున్నారు. స్పాయిల్‌తో క‌లిసి ఆయ‌న ప్రారంభించిన క్లాత్ బ్రాండ్ ‘ది హంబుల్ కో’ బుధ‌వారం అధికారికంగా ప్రారంభ‌మైంది. నేష‌న‌ల్ హ్యాండ్ లూమ్ డే సంద‌ర్భంగా హంబుల్ అండ్ కో ప్రారంభించారు మహేష్ బాబు.

ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. ‘‘హంబుల్ క్లోతింగ్ కలెక్షన్ నా పర్సనాలిటీ, స్టైల్‌ని ప్రతిబింబించేలా ఉంటుంది. సింపుల్‌గా, డౌన్ టు ఎర్త్ ఉండడానికే నేను ఇష్టపడతాను. హంబుల్‌లో అదే కనిపిస్తుంది. దీని ద్వారా ఫ్యాన్స్‌తో నా బంధం మరింత దృఢపడుతుందని భావిస్తున్నాను. నిజానికి భార్గ‌వ్ (స్పాయిల్ సి.ఇ.ఓ) వ‌చ్చి ఆలోచ‌న చెప్పగానే న‌చ్చింది. ఆయ‌న హంబుల్ అనే పేరు చెప్ప‌గానే క‌నెక్ట్ అయిపోయాను. నా ప‌ర్స‌నాలిటీకి ద‌గ్గ‌ర‌గా ఉంటుంద‌ని ఫీల‌య్యాను. హంబుల్‌లో ఎం, బి అనే అక్ష‌రాలు ప‌క్క ప‌క్క‌నే ఉన్నాయ‌ని అనుకోలేదు. వాటిని గ‌మ‌నించిన మా గ్రాఫిక్స్ టీం వాటిని అండ‌ర్‌లైన్ చేసింది’’ అని తెలిపారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.