రూ.450తో మొదలై రూ.17.60 లక్షలకు బాలాపూర్ లడ్డు రికార్డు

బాలాపూర్ గణనాథుడి లడ్డూ మరో రికార్డు సృష్టించింది. ఏటికేడు వేలం పాటలో ఎక్కువ మొత్తంలో పాడి లడ్డూను దక్కించుకుంటున్న భక్తులు ఈ సారి కూడా భారీ మొత్తంలో వేలం పాడి లడ్డూను దక్కించుకున్నారు. ఈ సారి లడ్డూ రూ.17.60 లక్షలకు అమ్ముడుపోయింది. దీన్ని కొలను రాంరెడ్డి అనే భక్తుడు దక్కించుకున్నాడు. గత ఏడాది కంటే లక్ష రూపాయలు ఎక్కువ పలకడం విశేషం.కాగా,బాలాపూర్ లడ్డూకు ప్రత్యేకత ఉంది. 1994 నుంచి లడ్డూను వేలం వేస్తుండగా దీన్ని దక్కించుకోవడానికి చాలా మందే పోటీ పడుతుంటారు. ప్రారంభంలో స్థానికులకు మాత్రమే అవకాశం ఇచ్చిన నిర్వాహకులు తర్వాత బయటి వారికి కూడా అవకాశం ఇస్తూ వచ్చారు. రూ.వందల నుంచి మొదలైన వేలం పాట.. లక్షల ధరకు వెళ్లిపోయింది. 1994లో కొలను మోహన్ రెడ్డి రూ. 450కి వేలం పాట పాడి లడ్డూను దక్కించుకున్నారు. 2018లో బాలాపూర్ మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా రూ.16 లక్షల 60 వేలకు దక్కించుకున్నారు. 2017లో నాగం తిరుపతి రెడ్డి రూ.15 లక్షల 60 వేలకు దక్కించుకున్నారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.