టీమిండియా కోచ్ కోసం ఆరుగురు షాట్ లిస్ట్

టీమిండియా కోచింగ్ స్టాఫ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. హెడ్ కోచ్ సహా బౌలింగ్, బ్యాటింగ్ కోచ్‌లతో పాటు ఫీల్డింగ్ కోచ్, ఫిజియో, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్, అడ్మిన్ మేనేజర్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దీనిలో భాగంగా హెడ్ కోచ్ పదవికి ఆరుగురిని సెలక్షన్ కమిటీ షార్ట్ లిస్ట్ చేసింది. ఆ జాబితాలో రవిశాస్త్రి సహా లాల్‌చంద్ రాజ్‌పుత్‌, రాబిన్ సింగ్‌ల‌తో పాటు మాజీ కివీస్ కోచ్ మైక్ హెస్సాన్‌, మాజీ శ్రీలంక కోచ్ టామ్ మూడీ, మాజీ ఆఫ్ఘనిస్తాన్ కోచ్ ఫిల్ జోన్స్‌లు ఉన్నారు. క‌పిల్‌దేవ్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజ‌రీ క‌మిటీ (సీఏసీ) ముందు తుది ఇంట‌ర్వ్యూకు హాజ‌రుకానున్నారు. ఈ వారం చివ‌ర‌లోగా లేదా వ‌చ్చే వారం కొత్త కోచ్ ఎవ‌ర‌న్నది తేలనుంది.

ప్రస్తుతం ర‌విశాస్త్రికి 45 రోజుల పొడిగింపు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ ఆరుగురు షార్ట్‌ లిస్టులో ఉన్నా.. విండీస్‌కు చెందిన ఫిల్ సిమ్మన్స్ కూడా హెడ్ కోచ్ ప‌ద‌వి కోసం పోటీప‌డుతున్నట్లు సమాచారం. అయితే, వీరిలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రవిశాస్త్రి వైపే మొగ్గు చూపుతుండటంతో మళ్లీ ఆయనే ప్రధాన కోచ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని టీమిండియా క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.