విస్కీకి బానిసై... ఆరోగ్యం పాడుచేసుకున్న: శృతి హాసన్

ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ కుమార్తెగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన శృతి హాసన్ అనతి కాలంలోనే మంచి గుర్తింపును పొందింది. తమిళం, తెలుగు భాషల్లోనే కాకుండా బాలీవుడ్ లో సైతం నటించి, మెప్పించింది. శృతి సినీ జీవితం గురించే కాకుండా... ఆమె ప్రైవేట్ లైఫ్ కూడా ఎక్కువగా పతాక శీర్షికల్లోకి ఎక్కింది. మైఖేల్ అనే విదేశీయుడి ప్రేమలో మునిగి తేలింది. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అతన్ని పెళ్లాడబోతున్నానని ప్రకటించిన శృతి... ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ప్రేమాయణానికి ముగింపు పలికింది. తాజాగా మంచు లక్ష్మికి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ మాట్లాడుతూ, ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.

తాను ఒకానొక సమయంలో విస్కీకి బానిసనయ్యానని శృతి తెలిపింది. రెండేళ్ల పాటు వివరీతంగా మందు తాగానని... దాంతో, తన ఆరోగ్యం పాడయిందని చెప్పింది. అనారోగ్యం నుంచి కోలుకోవడానికి తనకు చాలా సమయం పట్టిందని వెల్లడించింది. టాలీవుడ్ లో చివరిసారిగా పవన్ కల్యాణ్ సరసన 'కాటమరాయుడు' చిత్రంలో శృతి నటించింది. ఇప్పుడు రవితేజ సినిమాతో మళ్లీ రీఎంట్రీకి సిద్ధమవుతోంది.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.