శర్వాని హీరోగా గుర్తించలేదట!

వైజాగ్ బ్యాక్ డ్రాప్ తో మాఫియా క్రైమ్ నేపథ్యంలో రూపొందిన రణరంగం ఈ నెల 15న విడుదల కానుంది. శర్వానంద్ చాలా గ్యాప్ తర్వాత డెప్త్ ఉన్న డాన్ తరహా పాత్ర చేయడంతో అభిమానుల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. దానికి తగ్గట్టే ట్రైలర్ ఉండటంతో హైప్ మాములుగా లేదు. నిన్న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యూనిట్ లో చాలా కాన్ఫిడెన్స్ కనిపించింది. కాకినాడలో జరిగిన ట్రైలర్ లాంచ్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ గెస్ట్ గా రావడం పట్ల శర్వా ఎగ్ జైట్ అయ్యాడు.

తన స్పీచ్ లో మాట్లాడుతూ ఆయన దర్శకుడు కాక ముందు పెద్ద రైటర్ గా ఉన్నప్పుడే కలిశానని తనకు ఏదైనా పాత్ర ఉంటే చెప్పమని కోరితే ముందు హీరోగా ఋజువు చేసుకుని ఆ తర్వాత కనిపించమని అడిగారని ఇప్పుడు ఇదుగో ఆయన ముందు ఇలా ఉన్నానని చెప్పాడు. అంటే ఇప్పుడు కోరుకున్న రీతిలో హీరోగా ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి ఇకనైనా ఓ సినిమా అన్నట్టు శర్వా అడిగిన తీరు బాగుంది. దానికి తగ్గట్టే త్రివిక్రమ్ కూడా శర్వానంద్ మీద ప్రశంశల జల్లులు కురిపించాడు.

ట్రైలర్ చూసాక ఇంకోసారి చూడాలనిపించి మళ్ళీ అడిగానని అంతగా ఎక్స్ ట్రాడ్రినరీ వర్క్ చేసిన దర్శకుడు సుధీర్ వర్మతో పాటు రెండు షేడ్స్ ఉన్న పాత్రలను అద్భుతంగా పోషించిన శర్వానంద్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పడం విశేషం. శర్వానంద్ గొప్ప నటుడే అంతకు మించి మంచి మనిషని మెచ్చుకున్న త్రివిక్రమ్ భవిష్యత్తులో అతనితో సినిమా ఉంటుందని మాత్రం నేరుగా చెప్పలేదు. అంటే శర్వాకు ఇంకొంత కాలం వెయిటింగ్ తప్పదన్న మాట . స్వాతంత్ర దినోత్సవం నాడు భారీ ఎత్తున విడుదల కానున్న రణరంగంలో కళ్యాణి ప్రియదర్శన్ - కాజల్ అగర్వాల్ హీరోయిన్లు గా నటించగా దివాకర్ మణి ఛాయాగ్రహణం ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందించారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.