సెన్సార్ పూర్తి చేసుకున్న 'నాని' స్ గ్యాంగ్ లీడర్‌ టీం

విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ `నాని`స్ గ్యాంగ్ లీడర్ మూవీ సెప్టెంబర్ 13వ తేదీ రిలీజ్ కానుంది. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక కాగా హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా నటించారు. లక్ష్మి , శరణ్య, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, రఘుబాబు ముఖ్య పాత్రలలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

సెప్టెంబర్ 10వ తేదీ `నాని`స్ గ్యాంగ్ లీడర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో గ్రాండ్ గా జరిగింది.ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. జెర్సీ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తరువాత హీరో నాని నటించిన `నాని`స్ గ్యాంగ్ లీడర్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. `నాని`స్ గ్యాంగ్ లీడర్ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ ఈ రోజు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ మూవీ కి UA సర్టిఫికేట్ జారీ చేసింది.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.