వైరల్ వీడియో: వామ్మో సమంత.. ఏంటా ఫిట్‌నెస్

దక్షిణాది సినీ పరిశ్రమల్లోని స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఆమెకున్న అభిమాన గణం అంతా ఇంతా కాదు. అక్కినేనివారి కోడలు అయిన తరవాత సమంతకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత మెరిగింది. ఒకప్పుడు హీరోయిన్ పాత్రలు, గ్లామర్ రోల్స్ చేసిన సమంత ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ మూవీలపై దృష్టి పెట్టారు. ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారు. ‘రంగస్థలం’, ‘యూటర్న్’, ‘మజిలీ’, ‘ఓ బేబీ!’, ‘సూపర్ డీలక్స్’ చిత్రాలు వీటికి ఉదాహరణలు.

ప్రస్తుతం శర్వానంద్‌తో కలిసి తమిళ చిత్రం ‘96’ తెలుగు రీమేక్‌లో సమంత నటిస్తున్నారు. ఈ సినిమా తప్ప మరే చిత్రాన్ని సమంత అంగీకరించలేదు. ప్రస్తుతం ఆమె ఒక వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఆ పనిమీదే ఆమె చెన్నై వెళ్లారని కూడా అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ.. సమంత వెబ్ సిరీస్ రాబోతోందనే ఆనందం మాత్రం ఆమె అభిమానుల్లో ఉంది.

సమంత తన ఫిట్‌నెస్ వీడియో ఒకదానిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ వీడియోలో సమంతను చూస్తే ఆమె అభిమానులే కాదు ఎవరైనా షాక్ కావాల్సిందే. ప్రొఫెషనల్ అథ్లెట్ మాదిరిగా బార్స్‌ను రెండు చేతులతో పట్టుకొని జర జర పైకి పాకేస్తున్నారు. దీన్ని ‘పార్కౌర్’ అంటారట. ఫిట్‌నెస్ ట్రైనర్ అభినవ్ ఆధ్వర్యంలో సమంత ఈ పార్కౌర్ ఫీట్లు చేశారు. అదొక్కటే కాదు రెండు రోజుల క్రితం సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కొన్ని వీడియోలు పెట్టారు. అవి కూడా ఫిట్‌నెస్‌కు సంబంధించినవే. అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

‘‘కొత్తవాటిని ప్రయత్నించడానికి ఎప్పుడూ భయపడొద్దు. మీ సామర్థ్యం ఏంటో తెలిసినప్పుడు మీరే ఆశ్చర్యపోతారు. పార్కౌర్ చాలా బాగుంది’’ అని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో సమంత పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు కాజల్, ప్రగ్యా జైస్వాల్, రెజీనా, పూజా హెగ్డే, నమ్రతా శిరోద్కర్ స్పందించారు. అద్భుతంగా ఉందంటూ వీరంతా సమంతను కొనియాడారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.
 

Most Viewed

డిస్కో భామ పాయల్ రాజ్‌పుత్ హాట్ హాట్ స్టిల్స్

మున‌గాకు లాభాలు తెలిస్తే.. వెంట‌నే తింటారు..!

మధుమేహానికి దివ్యౌషధంగా పని చేసే ఆవాలు

గర్భిణులు అమెరికాకి రావద్దు.. ట్రంప్ వింత ఆలోచనతో కొత్త నిర్ణయం

వెల్లుల్లిని ప్రతిరోజు ఉపయోగిస్తే.. ఇన్ని ఉపయోగాలా?

తాగొచ్చి.. లోకేష్ ని కొట్టడానికి ప్లాన్ వేసిన మంత్రులు:యనమల

తెలుగు రాష్ట్రాల్లో రైల్వేకి సంక్రాంతి ఆదాయం ఎంతంటే..

చంద్రయాన్-3 మిషన్‌కు శ్రీకారం

2025 నాటికి ప్రపంచంలో నెంబర్ వన్ గా...

ప్రజాస్వామ్య సూచిక.. భారత్ లో దిగజారిన పౌర స్వేచ్ఛ

లైన్ లో రెండు ఉన్నాయి.. మూడో దానికి గ్రీన్ సిగ్నల్

అందంగా ఉన్న రోజా.. బాలయ్య ఆమెకు దిష్టిబొమ్మ.. వర్మ ట్వీట్

అమరావతిలో వందల ఎకరాల భూములు కొన్నపేదలపై సిఐడి కేసులు

ఫిబ్రవరి 2న విజయవాడలో జనసేన లాంగ్‌మార్చ్‌

ప్రియుడిని చంపి శవాన్ని తింటూ వీడియో తీసిన పోర్న్ స్టార్

ఇకనుండి 'మాల్స్' 24 గంటలూ ఓపెన్: కేబినెట్ ఆమోదం

పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ షూటింగ్ వీడియో లీక్..

హైదరాబాద్ కి చేరిన చైనా వైరస్?

బాలకృష్ణతో రోజా సెల్ఫీ..ఫ్రేమ్ లో చంద్రబాబు కూడా..!

జనసేన ఎమ్మెల్యే రాపాకపై శ్రీరెడ్డి కేక పోస్ట్...!