రూ. 30 ఇవ్వలేక త్రిపుల్‌ తలాక్‌ చెప్పిన ప్రబుద్దుడు!

జ్వరం వచ్చింది.. మెడిసిన్స్‌ కొనడానికి రూ. 30 ఇవ్వమని అడిగినందుకు ఆమెకు త్రిపుల్‌ తలాక్‌ చెప్పాడు ప్రబుద్దుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. బాధితురాలి మాటల్లో.. తనకు మూడేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి జ్వరం వస్తోంది. దీంతో మెడిసిన్స్‌ కోసం రూ. 30 ఇవ్వమని తన భర్తను అడిగాను. డబ్బులు లేవంటూ తనపై కోపం చేస్తూ తీవ్రంగా మందలించాడు. ఆ తర్వాత త్రిపుల్‌ తలాక్‌ చెప్పి.. ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితురాలు చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు

ఏకకాలంలో మూడుసార్లు తలాక్‌ చెప్పడం ద్వారా విడాకులిచ్చే పద్ధతిని క్రిమినల్‌ నేరంగా పరిగణించే ముస్లిం మహిళల(వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు-2019 బిల్లును పార్లమెంట్‌ ఇటీవలే ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదించడంతో ఆ బిల్లు చట్టం రూపం దాల్చింది. ముస్లిం మహిళకు మూడుసార్లు తలాక్‌ చెబితే.. కొత్త చట్టం ప్రకారం భర్తలకు మూడేళ్ల జైలు శిక్ష విధించనున్నారు.

 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.