`ప్రతీ రోజు పండ‌గే` కోసం సాయితేజ్ సిక్స్ ప్యాక్‌?

తెలుగునాట సిక్స్ ప్యాక్ ఓ ట్రెండ్‌గా మారింది. ఇప్పుడు ఈ జాబితాలో మెగాహీరో సాయితేజ్ కూడా చేర‌నున్నాడ‌ని స‌మాచారం.

ఆ వివరాల్లోకి వెళితే… సాయి తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో `ప్రతీ రోజు పండ‌గే` పేరుతో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో రెండు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయట. వాటిలో ఒకటి హీరో సాయి తేజ్ హోమం చేస్తుండగా వచ్చే యాక్షన్ సీన్. ఆ సీన్‌లో హీరో షర్ట్ లేకుండా ఫైట్ చేయాల్సి వస్తుందట. అందుకోసం ఫిట్‌నెస్‌తో పాటు… సిక్స్ ప్యాక్ కూడా ఉంటే బాగుంటుందని తేజు భావిస్తున్నాడట. తదుపరి షెడ్యూల్ ఈ నెల 20 నుంచి ఉండడంతో… ఫిట్‌నెస్‌ ట్రైనర్ సాయంతో వర్కౌట్ క్లాసెస్‌ను కూడా అటెండ్ అవుతున్నాడ‌ట తేజు. మరి ఫైట్ సీక్వెన్స్ కోసం తేజు చేస్తున్న ఈ సిక్స్ ప్యాక్ ప్రయత్నం ప్రేక్షకులను ఏ మేరకు రంజింప‌జేస్తుందో తెలియాలంటే మరి కొంతకాలం వేచి ఉండాల్సిందే.

కాగా… మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్‌ నిర్మాత‌గా తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రం… 2020 సంక్రాంతి సంద‌ర్భంగా విడుదల కానుందని ప్రచారం సాగుతోంది. ఇందులో సాయితేజ్‌కి జోడీగా రాశీఖ‌న్నా న‌టిస్తోంది.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.