సాహో రివ్యూ

తారాగణం: ప్రభాస్‌, శ్రద్ధ కపూర్‌, వెన్నెల కిషోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు
కథ, దర్శకత్వం: సుజీత్‌ నిర్మాత‌లు : ప్రమోద్, వంశీ, విక్ర‌మ్ సంగీతం : జిబ్రాన్

రేటింగ్: 2.5/5

కథ:
ప్రపంచంలోనే కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్స్‌ ఉండే వాజీ సిటీలో ‘సాహో’ కథ మొదలవుతుంది. పృథ్వీ రాజ్‌ (టిను ఆనంద్‌) తన అండర్‌ వరల్డ్‌ సామ్రాజ్యానికి తన కొడుకు దేవరాజ్‌ (చుంకీ పాండే)ను వారసుణ్ని చేయాలనుకుంటాడు. అయితే పృథ్వీరాజ్‌ చేరదీసిన రాయ్‌ (జాకీ ష్రాఫ్‌)… రాయ్‌ గ్రూప్‌ పేరుతో క్రైమ్‌ సిండికేట్‌ను నడిపిస్తుంటాడు. దీంతో రాయ్‌ మీద దేవరాజ్‌ పగ పెంచుకుంటాడు. ఓసారి రాయ్‌ సొంత ఊరైన ముంబయికి వచ్చి అనుమానాస్పదంగా రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. అదే సమయంలో ముంబయిలో రూ. రెండు లక్షల కోట్లతో వస్తున్న ఓ షిప్‌ పేలిపోతుంది. ఈ నేపథ్యంలో రాయ్‌ కొడుకు విశ్వక్‌ (అరుణ్‌ విజయ్‌) గ్యాంగ్‌స్టర్‌ సామ్రాజ్యంలోకి వారసుడిగా వస్తాడు. పోయిన ఆ రూ.రెండు లక్షల కోట్లను రెండు వారాల్లో తీసుకొస్తానని సవాలు చేస్తాడు. మరోవైపు ముంబయిలో రూ.రెండు వేల కోట్ల దొంగతనం జరుగుతుంది. దాని సంగతి తేల్చడానికి అండర్‌ కవర్‌ కాప్‌గా అశోక్‌ చక్రవర్తి (ప్రభాస్‌) సీన్‌లోకి వస్తాడు. క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందిన అమృతా నాయర్‌ (శ్రద్ధ కపూర్‌)తో కలసి ఈ కేసును విచారిస్తుంటాడు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇంతకీ రాయ్‌ని ఎవరు చంపారు, విశ్వక్‌ రూ.రెండు లక్షల కోట్లు సంపాదించాడా, అశోక్‌ చక్రవర్తి - అమృతా నాయర్‌ ప్రేమ ఏమైంది, అసలు ఇందులో సాహో ఎవరు అనేదే కథ.

పెర్ఫార్మన్స్:
ప్రభాస్‌ అండర్‌ కవర్‌గా కాప్‌గా అదరగొట్టాడు. సెటిల్డ్‌గా కనిపిస్తూ, యాక్షన్‌ సన్నివేశాల్లో తనదైన ఈజ్‌ను చూపించాడు. సినిమా ద్వితీయార్ధంలో షేడ్స్‌ మార్చడంలో పరిణితిని చూపించాడు. యాక్షన్‌ సన్నివేశాల్లో కొన్ని చోట్ల హాలీవుడ్‌ హీరోలను తలపించాడు. ప్రేమ సన్నివేశాల్లో ‘మిర్చి’ రోజులను గుర్తు చేశాడు. పోలీసు అధికారిణిగా శ్రద్ధ కపూర్‌ చక్కగా ఒదిగిపోయింది. సగటు అమ్మాయిలా కనిపిస్తూ... అవసరమైనప్పుడు ఫైట్లు చేస్తూ పాత్రకు న్యాయం చేసింది. వీరిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు బాగా పండాయి. యాక్షన్‌ - ప్రేమను మిళితం చేయడంతో దర్శకుడు విజయం సాధించాడనే చెప్పాలి. గ్యాంగ్‌స్టర్‌ నాయకుడిగా చుంకీ పాండే చక్కటి నటన కనబరిచాడు. డాన్‌ లుక్‌లో తన స్టైల్‌ మేనరిజమ్స్‌తో అదరగొట్టాడు. కల్కిగా మందిరా బేడీ బాగా చేసింది. జాకీ ష్రాఫ్‌, టిను ఆనంద్‌, అరుణ్‌ విజయ్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, మురళీ శర్మ తమ పాత్రల మేరకు నటించారు.

ప్లస్‌ పాయింట్‌ :

యాక్షన్‌ సీన్స్‌
ప్రభాస్
నేపథ్య సంగీతం
సినిమాటోగ్రఫి

మైనస్‌ పాయింట్స్‌ :

కథా కథనాలు
నిడివి
ఎడిటింగ్‌

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే…మధి సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలతో పాటు మిగిలిన సన్నివేశాలను కూడా ఆయన కథాకథనాలకు అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. అయితే సినిమాలో స్లోగా సాగే సీన్స్ ను సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది.

ఇక సంగీత దర్శకులు తనిష్క్ బాగ్చి, గురు రాంధ్వా, బాద్షా, శంకర్ ఎహసాన్ లాయ్ సమకూర్చిన పాటలు వినడానికి కంటే.. స్క్రీన్ మీద బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. అలాగే జిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాతలు ప్రమోద్, వంశీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ళ నిర్మాణ విలువులు అద్భుతంగా ఉన్నాయి.

తీర్పు :

‘సాహో’ కథతో ఆకట్టుకోలేకపోయినా.. ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఓ మంచి విజువల్ ట్రీట్ లా అనిపిస్తోంది.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.