ఆర్ఆర్ఆర్ మూవీ గురించి షాకింగ్ న్యూస్

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. వచ్చే యేడాది జూన్ నెలాఖరులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

ఈ క్రమంలో ఈ చిత్రం గురించిన ఓ షాకింగ్ న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో ఉత్కంఠ రేపే స‌న్నివేశాల‌తో పాటు అల‌రించే పాట‌లు ఎనిమిది ఉంటాయ‌ట‌. ఆ పాట‌లు దేశ‌భక్తిని పెంచే పేట్రియాటిక్ సాంగ్స్ అని కొంద‌రు చెబుతుండ‌గా, వాటితో పాటు హీరో హీరోయిన్స్ మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ సాంగ్స్ కూడా ఉంటాయ‌ని మ‌రికొంద‌రు అంటున్నారు.

స్వాతంత్ర్యకాంక్షను రగిల్చే పాటలను సుద్ధాల అశోకతేజ రాస్తున్నారు. మిగిలిన పాటలను ఇతర గేయ రచయితలు రాస్తున్నారట. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. కాగా, బాహుబలి చిత్రం తర్వాత రాజమౌళి నిర్మిస్తున్న చిత్రం కావడంతో దేశ వ్యాప్తంగా భారీ అంచనాలే నెలకొన్నాయి.

 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.