రెవిన్యూ బిల్లుపై బీజేపీ సెల్ఫ్ గోల్

బీజేపీ తెలంగాణ రాష్ట్రం లో అధికారం లోకి రావాలని ఉవిళ్ళూరుతుంది. కెసిఆర్ కి తామే ప్రత్యామ్నాయమని ప్రచారం చేసుకుంటుంది. అందులో కొంత వాస్తవమున్న మాట నిజం. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ దీపం కునారిల్లుతున్న సమయం లో రాజకీయనాయకులు అందులో కొనసాగటానికి ఇష్టపడటం లేదు. బీజేపీ కి వలసలు అన్నిచోట్లా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే తెలంగాణా లో కూడా వలసలపర్వం మొదలయ్యింది. త్వరలో మరికొంతమంది నాయకులు చేరబోతున్నారని వార్తలొస్తున్నాయి. అంతవరకూ బాగానే వుంది. కాంగ్రెస్ కు బదులు బీజేపీ కెసిఆర్ కి ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు మెండుగా వున్నాయి. కానీ కెసిఆర్ లాంటి రాజకీయ చాణిక్యుడుని ఓడించాలంటే అదొక్కటే సరిపోదు. సరైన ఎత్తుగడలు తీసుకోకపోతే ప్రతిపక్షం లో కాంగ్రెస్ కి బదులు బీజేపీ ఉంటుంది. అక్కడే నాయకత్వ సమర్ధత తో అవసరముంది.

ఇప్పటికే కెసిఆర్ బీజేపీ ని ఇరకాటం లో పెట్టే పనికి సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తుంది. దానికి కావాల్సిన ప్రచార ఆయుధాలను రెడీ చేసుకుంటున్నాడు. ఉదాహరణకు గత లోక్ సభ లో అమిత్ షా తెలంగాణ విభజన ప్రక్రియపై కాంగ్రెస్ నిర్వాకాన్ని ఎండగట్టిన తీరుపై బీజేపీ ని తెలంగాణ వ్యతిరేకిగా ముద్రవేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే నిధుల విషయం లో కేంద్రం తెలంగాణ పై సీత కన్ను వేసిందని ప్రచారం చేస్తున్నారు. ఇంకా ఇటువంటి ప్రచారాన్ని రాను రానూ ముమ్మరం చేస్తారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందుకనే కాంగ్రెస్ ని బలహీనపర్చటం వేరు, బలమైన ప్రాంతీయపార్టీని ఎదుర్కోవటం వేరు. బీజేపీ ఇక్కడే జాగ్రత్తగా అడుగులు వేయకపోతే శాశ్వతంగా ప్రతిపక్షం లో వుండే అవకాశం వుంది.

ఉదాహరణకు కెసిఆర్ నూతన రెవిన్యూ బిల్లును ప్రవేశపెట్టబోతున్నాడు. దానిపై బీజేపీ దాడిని ముమ్మరం చేసింది. అవసరమైతే కోర్టు కైనా వెళ్తామని ప్రకటించింది. ఈ విషయం లో బీజేపీ పప్పులో కాలేస్తుందనిపిస్తుంది. ఎందుకంటే రెవిన్యూ శాఖ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుంది. అంత అవినీతి శాఖ మరొకటిలేదు. ఈ ప్రజల సెంటిమెంటును రెవిన్యూ శాఖ ప్రక్షాళన ద్వారా కెసిఆర్ సొమ్ముచేసుకుందామని అనుకుంటున్నాడు. రాజకీయకోణాన్ని పక్కన పెడితే రెవిన్యూ శాఖ ప్రక్షాళనను ప్రతి ఒక్కరూ స్వాగతించాలి. రెవిన్యూ ఉద్యోగుల ఒత్తిడితో బీజేపీ వాళ్లకు తందానా తానా వంతపాడటం సరికాదు. ఇది బీజేపీ పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం వుంది. బీజేపీ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకొని కొత్త రెవిన్యూ చట్టాన్ని స్వాగతించాలి. అయితే చట్టం లో ఏవైనా లోపాలుంటే నిర్మాణాత్మక సూచనలు ఇస్తే బాగుంటుంది ప్రజలు హర్షిస్తారు . అలాకాకుండా రెవిన్యూ ఉద్యోగుల పక్షాన నిలిస్తే ప్రజల్లో లేనిపోని అపోహలు కొని తెచ్చుకున్న వాళ్లు అవుతారు. ఇదంతా చూస్తుంటే ఎన్టీఆర్ అధికారం లోకి వచ్చిన కొత్తలో ఆంధ్రాలో కరణం, మునసబు పోస్టులను , తెలంగాణ లో పటేల్, పట్వారి పోస్టులను రద్దు చేసినప్పుడు ప్రజల్లో ఎంతో పాపులారిటీ వున్న పుచ్చలపల్లి సుందరయ్య ఇది దుందుడుకు చర్యగా అభివర్ణించాడు. ఈ రోజు బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు వెలిబుచ్చిన అభిప్రాయాన్నే వెలిబుచ్చాడు. రెవిన్యూ వ్యవస్థ చిన్నాభిన్నమై ప్రజలు ఇబ్బందుల పాలవుతారని అభిప్రాయపడ్డాడు. ఆ రోజు ఆయన అభిప్రాయం చూసి ఆశ్చర్యపోవటం ప్రజలవంతయ్యింది. సుందరయ్యగారిలాంటి వారు పటేల్, పట్వారీ లకు వంతపాడటమేంటని అనుకున్నారు. వాస్తవానికి ఆయన ఉద్దేశం వాళ్ళను సమర్శించటం కాదు, ప్రజలు ఇబ్బందులు పాలవుతారేమోననే అనుమానం. అలాగే ఈరోజు బీజేపీ ఏ ఉద్దేశం తో మాట్లాడినా ప్రజలు హర్షించరని గమనించాలి. ముఖ్యంగా రెవిన్యూ ఉద్యోగులను వెనకేసుకురావటం అసలు హర్షించరు. ఇది ఎంత త్వరగా గ్రహిస్తే బీజేపీ కి అంత మంచిది. వచ్చే ఎన్నికల్లో అధికారం లోకి రావాలని కళలు కంటే సరిపోదు దానికి తగ్గ వ్యూహాలు కూడా జాగ్రత్తగా తీసుకున్నప్పుడే అది సాధ్యమవుతుందని నాయకులు గ్రహిస్తే మంచిది.

By తేజ

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.
 

Most Viewed

అమరావతి భూ కుంభకోణంపై నిజాన్ని నిగ్గు తేల్చాలి

మీకు అర్దమౌతోందా...సరిలేరు నీకెవ్వరులో కొత్త సీన్లు యాడ్ కాబోతున్నాయట!

రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ దర్శకుడికి తీవ్రగాయాలు

జగన్ స్కెచ్ లో.. చంద్రబాబుకి తాత్కాలిక విజయం

సోనీ నుండి విడుదలైన ఆండ్రాయిడ్‌ వాక్‌మన్‌ ప్లేయర్‌

రక్తం పెరగాలంటే..ఈజీ చిట్కాలు

డిస్కో భామ పాయల్ రాజ్‌పుత్ హాట్ హాట్ స్టిల్స్

మున‌గాకు లాభాలు తెలిస్తే.. వెంట‌నే తింటారు..!

గర్భిణులు అమెరికాకి రావద్దు.. ట్రంప్ కొత్త నియమం

వెల్లుల్లిని ప్రతిరోజు ఉపయోగిస్తే.. ఇన్ని ఉపయోగాలా?

తాగొచ్చి.. లోకేష్ ని కొట్టడానికి ప్లాన్ వేసిన మంత్రులు:యనమల

తెలుగు రాష్ట్రాల్లో రైల్వేకి సంక్రాంతి ఆదాయం ఎంతంటే..

అఘోరగా బాలయ్య? బీభత్సముగా ప్లాన్ చేసిన బోయపాటి

చంద్రయాన్-3 మిషన్‌కు శ్రీకారం

2025 నాటికి ప్రపంచంలో నెంబర్ వన్ గా...

ప్రజాస్వామ్య సూచిక.. భారత్ లో దిగజారిన పౌర స్వేచ్ఛ

లైన్ లో రెండు ఉన్నాయి.. మూడో దానికి గ్రీన్ సిగ్నల్

అందంగా ఉన్న రోజా.. బాలయ్య ఆమెకు దిష్టిబొమ్మ.. వర్మ ట్వీట్

అమరావతిలో వందల ఎకరాల భూములు కొన్నపేదలపై సిఐడి కేసులు

ఫిబ్రవరి 2న విజయవాడలో జనసేన లాంగ్‌మార్చ్‌