రేవంత్ రెడ్డి ప్రభ మసకపారిందా?

రేవంత్ రెడ్డి , ఈ పేరు మూడు సంవత్సరాల క్రితం ఓ సంచలనం. తర్వాత జరిగిన ఒక్కొక్క సంఘటన తన పూర్వ వైభవాన్ని తుడిచిపెట్టేసింది. మొదట్లో కెసిఆర్ కి ఎదురునిలిచే మొనగాడుగా యూత్ లో పెద్ద క్రేజ్ వచ్చింది. అయితే అప్పుడు తెలుగుదేశం లో ఉండటంలో రావలసినంత లబ్ది రాలేదు. తర్వాత కెసిఆర్ తెలివిగా ఓటుకు నోటు కేసులో ప్రత్యక్షంగా ఇరికించటంతో మేధావుల్లో, మధ్యతరగతి వర్గాల్లో కొంత ప్రతిష్ట దెబ్బతింది. అయినా వున్నవాళ్లలో కెసిఆర్ కి ఎదురునిలిచే సత్తా వున్నవాడుగా సర్దుకుపోయారు. ఆ తర్వాత తెలుగుదేశం తెలంగాణాలో పూర్తిగా దెబ్బతినడంతో తన భవిష్యత్తు సందేహంలో పడింది.

ఆసమయంలో బీజేపీ ప్రభ పుంజుకోవటం మొదలుపెట్టింది. కాంగ్రెస్ లోని అనేకమంది బీజేపీ లో చేరతారని ప్రచారం జరిగింది. అప్పుడు గనక రేవంత్ రెడ్డి బీజేపీ లో చేరివుంటే తెలంగాణ బీజేపీ లో తిరుగులేని నాయకుడు అయివుండేవాడు. రేవంత్ రెడ్డి తనన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని బేరం పెట్టినట్లుగా అందరూ అనుకున్నారు. అప్పటికి బీజేపీ ఆ అభ్యర్ధనను ఆమోదించలేదని అందరూ అనుకుంటున్నారు. ఆ తర్వాతదశలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరటం అందరికీ తెలిసిందే. అది కొంతమేరకు లోక్ సభకు ఎన్నిక కావటానికి ఉపయోగపడినా భవిష్యత్తు ఆశాజనకంగా లేదు. అసలు కాంగ్రెస్ పరిస్థితే బాగాలేదు. అది మునిగిపోయే నావలాగా ఉండటంతో రేవంత్ రెడ్డి భవిష్యత్తు కూడా డోలాయమానంలో పడింది.

అదే అంటారు రైట్ టైం లో రాంగ్ డెసిషన్ అని. రేవంత్ రెడ్డి లో స్ట్రాంగ్ పాయింట్లు ఎన్ని ఉన్నాయో వీక్ పాయింట్లు కూడా అన్నే వున్నాయి. రాష్ట్ర స్థాయినాయకుడు కావాల్సిన వ్యక్తి ఓపెన్ గా తన కులాన్ని అన్నివిషయాల్లో వెనకేసుకురావటం తన బలమూ , బలహీనత కూడా . రెడ్డి కులస్థుల్లో అభిమానాన్ని కూడగట్టుకున్నా మిగతా కులాల్లో దానివలన ఎంతోకొంత పోగొట్టుకోవటం జరిగింది. అలాగే అత్యాశ వల్ల కూడా నష్టపోవటం జరిగింది. లేకపోతె ఇప్పటికి బీజేపీ లో తిరుగులేని నాయకుడు అయివుండేవాడు. ఒకవేల ఇప్పుడు చేరాలన్నా అందరిలో ఒకడిగానే ఉంటాడు. మహబూబ్ నగర్ లోనే అరుణ, జితేందర్ రెడ్డి నాయకులుగా వున్నారు. మొత్తం మీద చూస్తే రేవంత్ రెడ్డి మూడు సంవత్సరాల క్రితం వున్న ప్రభ, ప్రతిష్టని చేతులారా చెడగొట్టుకున్నాడని అనిపిస్తుంది. కాలమే చెప్పాలి మరి.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.